వేసవిలో ఆహారం విషయంలో జాగ్రత్తలు తీసుకుంటే శరీరానికి అనుకూలంగా ఉంటుంది. వేడిని తగ్గించే హైడ్రేషన్ ఆహారాలను ఎక్కువగా తీసుకోవాలి. అయితే, వేసవిలో కొన్ని రకాల ఫుడ్స్ తీసుకోవడం వల్ల ఇబ్బందిగా అనిపిస్తుంది. అలా.. సమ్మర్‌లో ఎక్కువ తినకూడనవి ఏవంటే..
Photo: Pexels
కారం ఎక్కువగా ఉండే ఆహారాలను వేసవిలో అధికంగా తినకూడదు. కారం మోతాదు కంటే తక్కువగా ఉంటే మేలు. కారం ఎక్కువగా ఉండే ఆహారం తింటే శరీరంలో వేడి, చెమటలు పెరిగే అవకాశం ఉంటుంది.
Photo: Pexels
సమోసాలు, ఫ్రెంచ్ ఫ్రైస్, బర్గర్లు, బజ్జీలు లాంటి ఫ్రైడ్ ఫుడ్‍లను వేసవిలో లిమిట్ మేరకే తినాలి. ఎక్కువగా తింటే కడుపులో ఇబ్బందిగా అనిపిస్తుంది.
Photo: Pexels
వేసవిలో సోడా కూడా ఎక్కువగా తాగకుడదు. సోడా బదులు మజ్జిగ, లస్సీ, నిమ్మరసం, తాజా పండ్ల రసాలు తీసుకుంటే మేలు. వీటి వల్ల హైట్రేషన్ బాగా అందుతుంది.
Photo: Pexels
ఎండాకాలంలో మటన్, రెడ్ మీట్ తినడం తగ్గించాలి. లిమిట్‍లో తీసుకోవాలి. ఇవి ఎక్కువగా తింటే వేసవిలో శరీరంలో వేడి పెరుగుతుంది.
Photo: Pexels
వేసవిలో షుగర్ అధికంగా ఉంటే స్వీట్స్ కూడా తినకూడదు. వాటి బదులు మిల్క్ షేక్స్, ఫ్రూట్ జ్యూస్‍లు తీసుకుంటే డీహైట్రేషన్ సమస్య తగ్గి.. శక్తి పెరుగుతుంది.
Photo: Pexels
గుండెకు మేలు చేసే పొటాషియం పుష్కలంగా ఉండే ఫుడ్స్ ఇవి