పైనాపిల్ ఆరోగ్యానికి చాలా మంచిది. కానీ చలికాలంలో తినకపోవడమే మంచిదని నిపుణులు చెబుతున్నారు. అది ఎందుకో చూద్దాం..
Unsplash
By Anand Sai Nov 28, 2024
Hindustan Times Telugu
చలికాలంలో పైనాపిల్ ఎక్కువగా తినొద్దు. గర్భిణులకు మొదటి నెలల్లో పైనాపిల్ తీసుకోవడం మంచిది కాదు. ఇది గర్భస్రావాన్ని పెంచే అవకాశం ఉంది.
Unsplash
చలికాలంలో అలర్జీ సమస్యలు ఎక్కువగా ఉంటాయి. మీకు అలెర్జీ ఉంటే పైనాపిల్ అలెర్జీని తీవ్రతరం చేస్తుంది. ఇందులో ఉండే ఎంజైమ్‌లు పెదవులు మందంగా మారడం, గొంతు గీసుకోవడం వంటి దుష్ప్రభావాలకు కారణమవుతాయి.
Unsplash
ఆర్థరైటిస్‌తో బాధపడేవారికి శీతాకాలంలో పైనాపిల్ సిఫారసు చేయరు. ఎందుకంటే ఇది నొప్పిని మరింత తీవ్రతరం చేస్తుంది.
Unsplash
సైనస్ సమస్యలు, ముక్కు మూసుకుపోవడం, గొంతునొప్పి, కఫం వంటి సమస్యలు ఉన్నవారు చలికాలంలో పైనాపిల్ తినకూడదు.
Unsplash
పైనాపిల్‌లో మంచి మొత్తంలో సుక్రోజ్ షుగర్ ఉంటుంది. ఇది జీర్ణమయ్యేందుకు శరీరం కష్టపడాలి. మధుమేహ వ్యాధిగ్రస్తులు ఈ చక్కెరను త్వరగా జీర్ణించుకోలేరు.
Unsplash
యాంటీబయాటిక్స్ తీసుకుంటే పైనాపిల్‌లోని బ్రోమెలైన్ ఎంజైమ్ ఈ మందుల ప్రభావాలను తగ్గించగలదు.
Unsplash
ఇది ఆరోగ్యాన్ని మరింత దిగజార్చవచ్చు. చలికాలంలో పైనాపిల్ ఎక్కువగా తినకుండా ఉండటం మంచిది.
Unsplash
చలికాలంలో నువ్వులు ఎందుకు తినాలి..? వీటిని తెలుసుకోండి