సూర్యరశ్మి, గాయాలు, హార్మోన్ల హెచ్చుతగ్గుల వల్ల కాళ్లపై నల్లమచ్చలు వస్తుంటాయి. చర్మంలోని కొన్ని భాగాలలో మెలనిన్ అధికంగా ఉత్పత్తి కావడం వల్ల కూడా ఈ డార్క్ స్పాట్స్ ఏర్పడతాయి. కాళ్లపై నల్ల మచ్చలను ఇంటి చిట్కాలతో నయం చేసుకోవచ్చు.   

pexels

By Bandaru Satyaprasad
Oct 23, 2024

Hindustan Times
Telugu

కాళ్లపై నల్ల మచ్చలు రావడానికి కారణాలు 

pexels

సూర్యుని యూవీ కిరణాలు కాళ్లపై నల్లటి మచ్చల రావడానికి ముఖ్య పాత్ర పోషిస్తాయి. చర్మం అధిక సూర్యరశ్మికి గురైనప్పుడు శరీరం ఎక్కువ మెలనిన్‌ను ఉత్పత్తి చేస్తుంది. మెలనిన్ ఉత్పత్తి పెరిగి చర్మంపై నల్లని పాచెస్‌ ఏర్పడతాయి.   

pexels

హార్మోన్ల మార్పులు - కాళ్లపై నల్ల మచ్చలు ఏర్పడటానికి హార్మోన్ల హెచ్చుతగ్గులు మరో ముఖ్యమైన కారణం. గర్భధారణ సమయంలో హార్మోన్ల మార్పులు మెలనిన్ ను అధికంగా ఉత్పత్తి చేస్తాయి. ఫలితంగా హైపర్పిగ్మెంటేషన్ ఏర్పడుతుంది.   

pexels

చర్మ గాయాలు- చర్మంపై గాయాలు లేదా దురద మెలనిన్ ఉత్పత్తిని పెంచుతుంది. ఇది డార్క్ స్పాట్స్ ఏర్పడటానికి దారితీస్తుంది. చర్మం దెబ్బతిన్నప్పుడు శరీరం మరమ్మత్తు చేస్తుంది. దీని వల్ల గాయం ఏర్పడిన ప్రదేశంలో చర్మం నల్లగా ఉంటుంది.   

pexels

కాళ్లపై నల్ల మచ్చలను తగ్గించుకునేందుకు ఇంటి చిట్కాలు 

pexels

నిమ్మరసం - నిమ్మరసంలోని సిట్రిక్ యాసిడ్ చర్మంపై డార్క్ స్పాట్‌లను తగ్గించడంలో సహాయపడుతుంది. నిమ్మరసాన్ని నీటిలో కలిపి, ఆ మిశ్రమాన్ని డార్క్ స్పాట్స్‌కి అప్లై చేసి మసాజ్ చేయండి. 15-20 నిమిషాల తర్వాత చల్లటి నీటితో కడగండి.  

pexels

ఉల్లిపాయ రసం-ఉల్లిపాయ రసంలో సల్ఫర్ సమ్మేళనాలు ఉంటాయి.  ఇవి చర్మాన్ని కాంతివంతం చేస్తాయి. ఉల్లిపాయ రసం నల్ల మచ్చలు ఉన్న చోట రాసి 15-20 నిమిషాల పాటు ఉంచి, చల్లటి నీటితో శుభ్రం చేయండి.  

బంగాళదుంప రసం- బంగాళాదుంపలలో కాటెకాల్ ఆక్సిడేస్ అనే ఎంజైమ్ ఉంటుంది. ఇది మెలనిన్ ఉత్పత్తిని నిరోధిస్తుంది. బంగాళాదుంప రసాన్ని నల్లని మచ్చలు ఉన్న చోట రాసి 30 నిమిషాల పాటు ఉంచి చల్లటి నీటితో శుభ్రం చేయండి.  

pexels

షుగర్ స్క్రబ్ - షుగర్ స్క్రబ్ చర్మాన్ని ఎక్స్‌ఫోలియేట్ చేస్తుంది. మృతకణాలను తొలగించి, చర్మాన్ని ప్రకాశవంతం చేస్తుంది.  క్యారియర్ ఆయిల్ తో పంచదార కలిపి దానిని డార్క్ స్పాట్స్‌పై అప్లై చేసి మసాజ్ చేయండి. 

pexels

అలోవెరా జెల్- కలబంద మంట, దురద తగ్గించడానికి ఉపయోగపడుతుంది. చర్మ పునరుత్పత్తిని ప్రోత్సహించడంలో సహాయపడుతుంది. కలబంద జెల్‌ను నల్ల మచ్చలపై అప్లై చేయండి. రాత్రంతా అలాగే ఉంచి ఉదయం గోరువెచ్చని నీటితో శుభ్రం చేయండి.  

pexels

పసుపు - పసుపులో కర్కుమిన్ అనే యాంటీ ఇన్ ఫ్లమేటరీ ఉంటుంది. ఇది హైపర్‌పిగ్మెంటేషన్‌ను తగ్గిస్తుంది.  పసుపును కొద్దిగా నీళ్లతో కలిపి పేస్ట్ లా  చేసి డార్క్ స్పాట్స్‌కి అప్లై చేసి 15-20 నిమిషాల పాటు ఉంచండి. ఆ తర్వతా వెచ్చని నీటితో శుభ్రం చేయండి.  

pexels

పెరుగు- పెరుగులో లాక్టిక్ యాసిడ్ ఉంటుంది. ఇది చర్మాన్ని ఎక్స్‌ఫోలియేట్ చేయడానికి, హైపర్‌పిగ్మెంటేషన్‌ను తగ్గించడంలో సహాయపడుతుంది. డార్క్ స్పాట్స్‌కి పెరుగును అప్లై చేసి సున్నితంగా మసాజ్ చేయండి. 15-20 నిమిషాలు తర్వాత నీటితో కడగండి.   

గుండెకు మేలు చేసే పొటాషియం పుష్కలంగా ఉండే ఫుడ్స్ ఇవి

Photo: Pexels