సీతాఫలాల సీజన్ వచ్చేస్తోంది.. ఈ పండు వల్ల లాభాలు ఇవే
Photo: Pexels
By Chatakonda Krishna Prakash Sep 25, 2024
Hindustan Times Telugu
సీతాఫలం పండ్ల సీజన్ మొదలవుతోంది. ప్రతీ సంవత్సరం అక్టోబర్ నుంచి ఈ పండ్ల సీజన్ ప్రారంభమై శీతాకాలమంతా ఎక్కువగా వస్తాయి.
Photo: Pexels
సీతాఫలం పండ్లు తినడం వల్ల ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు ఉంటాయి. అవేంటో ఇక్కడ చూడండి.
Photo: Pexels
సీతాఫలం పండ్లలో ఫ్లేవనాయిడ్స్, విటమిన్ సీ ఎక్కువగా ఉంటాయి. దీనివల్ల వీటిని తింటే శరీరంలో రోగ నిరోధక శక్తి మెరుగవుతుంది.
Photo: Pexels
సీతాఫలం పండ్లలో సోలబుల్ ఫైబర్స్ ఉంటాయి. అందుకే జీర్ణక్రియకు తోడ్పడుతుంది. కడుపు సంబంధిత సమస్యలను కూడా ఈ పండు తగ్గించగలదు.
Photo: Pexels
సీతాఫలం పండు తినడం కంటి చూపునకు కూడా మేలు చేస్తుంది. ఈ పండులో ఉండే లూటెయిన్ అనే ఇందుకు కారణం. కంటి చూపును ఈ పండు మెరుగుపరచగలదు.
Photo: Pexels
సీతాఫలంలో విటమిన్ ఏ, విటమిన్ బీ6 ఎక్కువగా ఉంటాయి. ఇవి కొలాజెన్ ఉత్పత్తిని పెంచుతాయి. ఇది మీ చర్మ సమస్యలను తగ్గించగలవు. మెరుపును పెంచగలవు.
Photo: Pexels
సీతాఫలం పండ్లలో అన్‍సాచురేటెడ్ ఫ్యాట్స్, ఒమేగా-6 యాసిడ్స్ ఉంటాయి. దీనివల్ల ఇవి తింటే గుండె ఆరోగ్యానికి మేలు జరుగుతుంది. బ్లడ్ ప్రెజర్ లెవెల్స్ నియంత్రంచడంలోనూ ఈ పండు తోడ్పడుతుంది.