సీతాఫలం పోషకాహార పవర్‌హౌస్. వీటిలో ఫైబర్‌, మినరల్స్, విటమిన్లు వంటి అనేక పోషకాలు ఉంటాయి.  సీతాఫలంలో పీచుపదార్థాలు, యాంటీఆక్సిడెంట్లు, ఫ్లేవనాయిడ్స్, విటమిన్ B6, పొటాషియం, మెగ్నీషియం ఉంటాయి. సీతాఫలం వల్ల కలిగే10  ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకుందాం.  

pexels

By Bandaru Satyaprasad
Oct 12, 2024

Hindustan Times
Telugu

శక్తితో లోడ్- సీతాఫలంలో అధిక కేలరిఫిక్ వ్యాల్యూ ఉంటుంది. వీటిలో ఫ్రక్టోజ్, గ్లూకోజ్‌లు ఉంటాయి.  ఇవి శరీరానికి పుష్కలంగా శక్తిని అందిస్తాయి. సీతాఫలంలో ఐరన్ ఉంటుంది. ఇది రక్తహీనతను నయం చేస్తుంది.   

pexels

క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది- సీతాఫలం యాంటీ ఆక్సిడెంట్ రిచ్ ఫ్రూట్. ఇందులో అధిక సంఖ్యలో ఫ్లేవనాయిడ్‌లు ఉంటాయి. ఇవి క్యాన్సర్ కణాల పెరుగుదలను నిరోధిస్తాయి.   

pexels

మధుమేహాన్ని నియంత్రిస్తుంది- సీతాఫలంలో తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉంటుంది. మధుమేహం ఉన్నవారు సీతాఫలాన్ని మితంగా తినవచ్చు.    

pexels

స్కిన్ ఇన్ఫెక్షన్లకు చికిత్స- సీతాఫలంలో విటమిన్ ఎ, విటమిన్ బి6, విటమిన్ సి, జింక్, కాపర్ వంటి ముఖ్యమైన పోషకాల మీ చర్మాన్ని ఇన్ఫెక్షన్ల నుంచి రక్షిస్తుంది. ఇందులోని పోషకాలు మొటిమలు, అలర్జీలు, గడ్డలు, ఇతర చర్మ సమస్యలను నిరోధిస్తాయి.   

pexels

గుండె పనితీరును మెరుగుపరుస్తుంది - సీతాఫలంలోని అసంతృప్త కొవ్వులు, ఒమేగా -6 ఫ్యాటీ యాసిడ్స్  గుండె వ్యవస్థను బలోపేతం చేస్తుంది. దీంతో గుండె సమస్యలు తగ్గుతాయి.   

pexels

మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది- సీతాఫలంలో ఉండే విటమిన్ B మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది. నరాల సిగ్నలింగ్ ఏకాగ్రతను పెంపొందించి పనితీరును మెరుగుపరుస్తుంది.   

pexels

జీర్ణక్రియ - సీతాఫలాన్ని ఆహారంలో చేర్చుకోవడం వల్ల జీర్ణక్రియను ప్రోత్సహిస్తుంది. సీతాఫలంలోని ఫైబర్స్ మలబద్ధకాన్ని నివారిస్తుంది. ఫైబర్స్ ఆకలిని తీర్చడంలో సహాయపడతాయి.   

pexels

కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది- సీతాఫలంలో విటమిన్ ఎతో పాటు యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి కంటి ఆరోగ్యానికి కీలకం. వీటిలోని పోషకాలు శరీరంలో రక్త ప్రసరణను నియంత్రించడంలో సహాయపడతాయి.   

pexels

ఎముక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది- సీతాఫలంలోని పొటాషియం, విటమిన్ K ఎముకల బలహీనత, బోలు ఎముకల వ్యాధి నుంచి రక్షించడంలో సహాయపడతాయి. 

pexels

రోగనిరోధక వ్యవస్థ బలోపేతం - సీతాఫలంలో విటమిన్ సి రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తుంది. శరీరం నుంచి కొన్ని టాక్సిన్స్, ఫ్రీ రాడికల్స్‌ను బయటకు పంపడంలో సీతాఫలం సహాయపడుతుంది.   

pexels

గుండెకు మేలు చేసే పొటాషియం పుష్కలంగా ఉండే ఫుడ్స్ ఇవి

Photo: Pexels