తలలో చుండ్రు పేరుకుపోయిందా? ఆయుర్వేద మార్గంతో ఇలా దూరం చేసుకోండి..

pixabay

By Sharath Chitturi
Sep 11, 2023

Hindustan Times
Telugu

జుట్టుకు నూనె పెట్టకపోవడం, జీర్ణక్రియ సమస్యలు, ఒత్తిడి, షాంపూతో తల స్నానం చేయకపోవడం వంటివి చుండ్రు సమస్యకు కొన్ని కారణాలు.

pixabay

అయితే.. ఈ చండ్రు సమస్యను శాశ్వతంగా దూరం చేయగలిగే మార్గం ఆయుర్వేదంలో ఉంది. ఇందుకోసం ఒక మిశ్రమాన్ని తయారు చేసుకోవాలి.

pixabay

మూడు స్పూన్ల పెరుగు, రెండు స్పూన్ల నిమ్మరసం, ఒక స్పూన్​ మహాబ్రింగ్​రాజ్​ ఆయిల్​, చిన్న సైజు కర్పూరం, సగం టీ స్పూన్​ బోరాక్స్​ పౌడర్​ తీసుకోవాలి. వీటిని బాగా కలిపి, ఓ మిశ్రమంగా తయారు చేసుకోవాలి.

pixabay

పెరుగులో ఉండే ప్రోటీన్​, నిమ్మరసంలోని విటమిన్​ సీ, మహాబ్రింగ్​ రాజ్​ ఆయిల్​లో ఉండే ఆయుర్వేద ఔషధాలు చండ్రును దూరం చేయగలుగుతాయి.

pixabay

ఇక కర్పూరంతో జుట్టు ధృఢంగా మారుతుంది. బోరాక్స్​ పౌడర్​ అనేది చుండ్రు కోసం ప్రతేకంగా ఉపయోగించే ఆయుర్వేద పదార్థం.

pixabay

స్నానం చేసే 30 నిమిషాల ముందు ఈ మిశ్రమాన్ని తలకు అప్లై చేసుకోవాలి. కనీసం 10 నిమిషాల పాటైన ఈ మిశ్రమాన్ని తలకు మర్దన చేసుకోవాలి.

pixabay

వారంలో రెండుసార్లు ఇలా చేస్తే.. చండ్రు సమస్య దూరమవుతుంది. కానీ ఈ సమస్య చాలా ఎక్కువగా ఉందనిపిస్తుంటే, ఈ మిశ్రమాన్ని ఎక్కువ రోజుల పాటు ఉపయోగించాలి.

pixabay

చర్మం బాగుండాలంటే ప్రతీ రోజూ ఈ ఐదు పనులు చేయండి

Photo: Pexels