పొంగులేటి చేరిక, మల్లు భట్టి విక్రమార్క చేస్తున్న పాదయాత్ర ముగింపు సందర్భంగా భారీ సభను తలపెట్టింది కాంగ్రెస్. ఖమ్మం వేదికగా జులై 2 నిర్వహించే ఈ సభకు జనగర్జనగా నామకరణం చేసింది. రాహుల్ గాంధీ హాజరుకానున్నారు.