దాల్చిన చెక్క పీరియడ్స్ నొప్పి నుంచి ఉపశమనం కలిగించే హెర్బ్. దాల్చిన చెక్కలో జింక్, మాంగనీస్, కార్బొహైడ్రేట్లు, ప్రొటీన్, ఐరన్, విటమిన్లు ఉంటాయి.
pexels
By Bandaru Satyaprasad Apr 27, 2024
Hindustan Times Telugu
దాల్చిన చెక్కలోని యాంటీఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు మహిళల ఆరోగ్యానికి మేలు చేస్తాయి. పీరియడ్స్‌లో అసౌకర్యాన్ని తగ్గిస్తాయి.
pexels
పీరియడ్స్ లో విపరీతమైన నొప్పితో బాధపడే మహిళలకు దాల్చిన చెక్క వేగంగా ఉపశమనాన్ని అందిస్తుంది. ఇదిలోని యాంటిస్పాస్మోడిక్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు పీరియడ్స్ నొప్పి చికిత్సలో ప్రయోజనకరంగా ఉంటాయి.
pexels
పీరియడ్స్ నొప్పికి దాల్చిన చెక్కను ఎలా ఉపయోగించాలి?
pexels
దాల్చిన చెక్క టీ- పీరియడ్స్ నొప్పి రాత్రి నిద్రపోనివ్వకపోతే ఒక కప్పు దాల్చిన చెక్క టీని తాగితే కొంత ఉపశమనం వస్తుంది. పీరియడ్స్‌కు ముందు లేదా ఆ సమయంలో రెండుసార్లు తాగాలని నిపుణుల సిఫార్సు.
pexels
దాల్చిన చెక్క పొడిని గంజి, స్మూతీస్ లో తీసుకుంటే పీరియడ్స్ లో మహిళలకు నొప్పి నివారిణిగా సాయపడుతుంది.
pexels
దాల్చినచెక్క చాలా మందికి సురక్షితమైనప్పటికీ, కొంతమందికి హానికరం. మీకు అలెర్జీ ఉన్నట్లయితే దాల్చిన చెక్క ఉపయోగించకండి. దాల్చిన చెక్క అధిక వినియోగిస్తే కాలేయం, గర్భాశయాన్ని ప్రభావితం చేస్తుంది.
pexels
దాల్చిన చెక్క మితంగా ఉపయోగించాలి. పెద్ద మొత్తంలో ఉపయోగించినప్పుడు హానికరం. ఇది కేన్సర్, నోటి పుండ్లు, జీర్ణక్రియకు సంబంధించిన ఇతర సమస్యలకు కారణం కావచ్చు. దీనిని తీసుకునే ముందు వైద్యుని సలహా తప్పనిసరి.