అధిక కొలెస్ట్రాల్ అనేక ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. అందుకే తరచూ కొలెస్ట్రాల్ పరీక్షలు చేయించుకోవడం ముఖ్యం. కొలెస్ట్రాల్ టెస్ట్ కిట్ ద్వారా ఇంట్లోనే కొలెస్ట్రాల్ స్థాయిలు చెక్ చేసుకోవచ్చు.   

pexels

By Bandaru Satyaprasad
May 27, 2024

Hindustan Times
Telugu

కొలెస్ట్రాల్ మన రక్తంలో కనిపించే కొవ్వు లాంటి మైనపు పదార్థం. మీ శరీరానికి ఆరోగ్యకరమైన కణాల నిర్మాణం, హార్మోన్లు, విటమిన్ డి, ఆహారాన్ని జీర్ణం చేయడంలో మీ శరీరానికి కొలెస్ట్రాల్ అవసరం. 

pexels

వయస్సు పెరిగే కొద్దీ ప్రతి నాలుగు నుంచి ఆరు సంవత్సరాలకు ఒకసారి కొలెస్ట్రాల్ పరీక్షలు చేయించుకోవాలి. డయాబెటిక్, గుండె జబ్బులు లేదా అధిక కొలెస్ట్రాల్ ఫ్యామిలీ హిస్టరీ ఉన్నవారు కొలెస్ట్రాల్‌ను తరచుగా చెక్ చేసుకోవాలి. 

pexels

పిల్లలు తొమ్మిది నుంచి 11 సంవత్సరాల మధ్య, 17 ఏళ్లు నిండిన తర్వాత కనీసం ఒక్కసారైనా కొలెస్ట్రాల్ చెక్ చేయించుకోవాలి. మధుమేహం లేదా ఊబకాయం ఉన్న పిల్లలు తరచుగా ఈ పరీక్షలు చేయించుకోవడం మంచిది.  

pexels

కొలెస్ట్రాల్ లెవల్స్ చెక్ చేసే మార్గాలు- సాధారణంగా డయాగ్నోస్టిక్స్ లో రక్త పరీక్షల ద్వారా కొలెస్ట్రాల్ స్థాయిలు చెక్ చేస్తారు. ఈ పరీక్షలలో మొత్తం కొలెస్ట్రాల్, ఎల్‌డిఎల్, హెచ్‌డిఎల్, ట్రైగ్లిజరైడ్ల లిపిడ్ ప్యానెల్ చెక్ చేస్తారు. అయితే ఇంట్లో కూడా చెక్ చేసుకునేందుకు కొలెస్ట్రాల్ టెస్టింగ్ కిట్లు అందుబాటులో ఉన్నాయి.   

pexels

ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ ఆమోదించిన హోమ్ కొలెస్ట్రాల్ టెస్టింగ్ కిట్‌లు ద్వారా ఇంట్లోనే కొలెస్ట్రాల్ ను తనిఖీ చేయవచ్చు. కొలెస్ట్రాల్ పరీక్షకు ముందు 8 నుంచి 12 గంటల పాటు ఏం తినకుండా, ముందస్తు పరీక్ష సూచనలను పాటించాలి.   

pexels

కిట్‌లోని లాన్సెట్‌ లోని స్ట్రిప్ పై మీ వేలిని పొడిచి చిన్న రక్త నమూనాను సేకరించండి. స్ట్రిప్‌ను మీటర్‌లో ఉంచండి. స్ట్రిప్‌లో రంగు మార్పును అర్థం చేసుకోవడానికి కిట్ సూచనలను తెలుసుకోండి.  మొత్తం కొలెస్ట్రాల్ కొన్నిసార్లు HDL, LDL స్థాయిల విచ్ఛిన్నతను వివరిస్తుంది.  

pexels

మొత్తం కొలెస్ట్రాల్ 200 mg/dL కంటే తక్కువగా ఉండాలి. LDL కొలెస్ట్రాల్ విషయానికొస్తే, ఇది 100 mg/dL కంటే తక్కువగా ఉండాలి. HDL కొలెస్ట్రాల్ 60 mg/dLకి ఎక్కువగా లేదా సమానంగా ఉండాలి. ల్యాబ్స్ లో చేసే పరీక్షలతో పోలిస్తే ఇంట్లో చేసిన పరీక్షలు తక్కువ కచ్చితత్వం ఉండవచ్చు.   

pexels

గుండెకు మేలు చేసే పొటాషియం పుష్కలంగా ఉండే ఫుడ్స్ ఇవి

Photo: Pexels