సిగరెట్ పొగ ఒక్కసారి పీల్చగానే మీ శరీరంలో వచ్చే మార్పులు

By Haritha Chappa
Jun 07, 2024

Hindustan Times
Telugu

 సిగరెట్ తాగే వారి సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతోంది. ఒక సింగిల్ పఫ్ సిగరెట్ పీల్చగానే మీ శరీరంలో ఎన్నో మార్పులు కలుగుతాయి.

సిగరెట్లో నికోటిన్ ఉంటుంది. సిగరెట్ పఫ్ ఒక్కసారి పీల్చగానే అది శరీరంలో అడ్రినలిన్ అనే హార్మోనును విడుదల చేస్తుంది. 

ఈ అడ్రినలిన్ హార్మోను గుండె కొట్టుకునే వేగాన్ని పెంచుతుంది.  సిగరెట్ తాగిన కొన్ని క్షణాల్లోనే ఈ మార్పు జరుగుతుంది.

నికోటిన్ శరీరంలోకి వెళ్లగానే బ్లడ్ ప్రెషర్ పెరుగుతుంది. ఇది గుండెపై మరింత ఒత్తిడిని పెంచుతుంది. 

గుండెపై ఒత్తిడి పెరగడం వల్ల గుండె సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశం పెరుగుతుంది.

 పొగాకు తాగాక శరీరంలో ఆక్సిజన్ సరఫరాలకు అంతరాయం కలుగుతుంది. ఇది గుండె కండరాలపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. 

సిగరెట్ తాగడం వల్ల రక్తంలో గడ్డలు ఏర్పడే అవకాశం పెరుగుతుంది. దీనిల్ల గుండె జబ్బులు, బ్రెయిన్ స్ట్రోక్ వంటివి రావచ్చు. 

 సిగరెట్ తాగేవరికి భవిష్యత్తులో పక్షవాతం వచ్చే ఛాన్సులు ఎక్కువ. కాబట్టి ధూమపానం విడిచిపెడితేనే మంచిది.

పురాతన కాలం నుంచి ఖర్జూరం ప్రపంచవ్యాప్తంగా అనేక వంటకాల్లో ప్రధానమైనదిగా ఉపయోగిస్తున్నారు. ఈ డ్రై ఫ్రూట్స్ పిల్లల నుండి పెద్దల వరకు అందరి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.

Unsplash