కొబ్బరి నీళ్లు శరీరాన్ని చల్లబరుస్తాయి. అందుకే చలికాలంలో వీటిని తాగొచ్చా లేదా అని చాలా మందికి సందేహం ఉంటుంది. చలికాలంలో కొబ్బరి నీళ్లు తాగడం ఆరోగ్యకరమా కాదా అని ఆలోచిస్తుంటారు. ఆ వివరాలు ఇవే..
Photo: Pexels
చలికాలంలో వాతావరణం చల్లగా ఉన్నా కూడా కొబ్బరి నీళ్లు తాగొచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు.
Photo: Pexels
చలికాలంలో కొబ్బరి నీళ్లు నిరభ్యంతరంగా తాగొచ్చు. అలాగే, కొబ్బరి నీరు వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఇక్కడ చూడండి.
Photo: Pexels
కొబ్బరి నీరు తాగడం వల్ల శరీరంలో ఎనర్జీ లెవెల్స్ పెరుగుతాయి. ఎనర్జిటిక్‍గా ఉండొచ్చు.
Photo: Pexels
కొబ్బరి నీరు తాగితే జీర్ణక్రియకు మేలు జరుగుతుంది. ఒకవేళ జీర్ణ సంబంధిత సమస్యలు ఉంటే కొబ్బరి నీరు తాగడం చాలా ఉపశమనం లభిస్తుంది.
Photo: Pexels
కొబ్బరి నీళ్లలో క్యాలరీలు చాలా తక్కువగా ఉంటాయి. దీంతో ఇవి తాగితే బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరగవు. హై బ్లడ్ ప్రెజర్ ఉన్న వారికి కొబ్బరి నీరు తాగడం చాలా మంచిది.
Photo: Pexels
శరీరంలో కొలెస్ట్రాల్ కంట్రోల్‍లో ఉండేందుకు కూడా కొబ్బరి నీరు సహకరిస్తుంది. అలాగే క్యాలరీలు తక్కువగా ఉండడం వల్ల బరువు తగ్గేందుకు కూడా ఇవి తోడ్పడతాయి.
Photo: Pexels
బొప్పాయిలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది రోగ నిరోధక శక్తిని పెంచుతుంది.