డయాబెటిస్ ఉన్న వారు పుట్టగొడుగులు తినొచ్చా?

Photo: Pixabay

By Chatakonda Krishna Prakash
Nov 27, 2023

Hindustan Times
Telugu

పుట్టగొడుగుల్లో చాలా పోషకాలు ఉంటాయి. ఇవి తింటే ఆరోగ్యానికి చాలా మంచిది. పుట్టగొడుగుల వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి.. డయాబెటిస్ (షుగర్) ఉన్న వారు వీటిని తినొచ్చా.. అనేది ఇక్కడ తెలుసుకోండి. 

Photo: Pixabay

పుట్టగొడుగుల్లో గ్లిసెమిక్స్ ఇండెక్స్ చాలా తక్కువగా ఉంటుంది. అందుకే ఇవి తిన్నా శరీరంలో బ్లడ్ షుగర్ లెవెల్స్ ఎక్కువ కావు. అందుకే డయాబెటిస్ ఉన్న వారు పుట్టగొడుగులు తినవచ్చు. 

Photo: Pixabay

పుట్టగొడుగుల్లో విటమిన్ డీ, పాలిసాకురైడ్ పుష్కలంగా ఉంటాయి. దీంతో ఇవి తింటే డయాబెటిస్ ఉన్న వారికి అదనపు ఆరోగ్య ప్రయోజనాలు కూడా దక్కుతాయి. దీంతో మధుమేహం ఉన్న వారు కూడా పుట్టగొడుగులు తీసుకోవచ్చు. 

Photo: Pixabay

పుట్టగొడుగులు కొలెస్ట్రాల్ స్థాయిని కూడా తగ్గిస్తాయి. అందుకే మీ డైట్‍లో వీటిని యాడ్ చేసుకుంటే మంచిది. గుండె ఆరోగ్యానికి కూడా మష్రూమ్స్ మేలు చేస్తాయి. 

Photo: Pixabay

పుట్టగొడుగుల్లో బీటా గ్లూకాన్స్ లాంటివి కూడా ఉంటాయి. దీంతో ఇవి తింటే రోగ నిరోధక శక్తి మెరుగవుతుంది. 

Photo: Pixabay

పుట్టగొడుగుల్లో విటమిన్ డీ, విటమిన్ కే, విటమిన్ సీ ఉంటాయి. దీంతో ఇవి తింటే ఎముకల దృఢత్వం కూడా పెరుగుతుంది. 

Photo: Pixabay

మష్రూమ్‍ల్లో ఫైబర్, వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. దీంతో ఇవి తింటే కడుపు నిండుగా ఉన్న ఫీలింగ్ చాలా సేపు ఉంటుంది. దీని వల్ల బరువు తగ్గేందుకు కూడా పుట్టగొడుగులు తోడ్పడతాయి. 

Photo: Pixabay

గుండెకు మేలు చేసే పొటాషియం పుష్కలంగా ఉండే ఫుడ్స్ ఇవి

Photo: Pexels