జీడిపప్పుతో బరువు పెరుగుతామా? తగ్గుతామా?

By Haritha Chappa
May 31, 2024

Hindustan Times
Telugu

జీడిపప్పును ప్రతిరోజూ తింటే బరువు పెరుగుతామని ఎంతో మంది అనుకుంటారు. వాటిని అధికంగా తింటే బరువు పెరుగుతారు కానీ మితంగా తింటే పెరగరు.

రోజుకు మూడు నుంచి నాలుగు జీడిపప్పులు తినండి చాలు. రాత్రి నానబెట్టాక ఉదయం వాటిని తినాలి. అప్పుడు మంచి ఫలితాలు లభిస్తాయి.

జీడిపప్పులో ఒమెగా 3 కొవ్వు ఆమ్లాలు ఉంటాయి. వీటిని తినడం వల్ల గుండెకు మేలు జరుగుతుంది.

ఒమెగా 3 కొవ్వు ఆమ్లాలు శరీరంలో కొవ్వును కరిగించేందుకు సహాయపడతాయి. 

జీడిపప్పును తినడం వల్ల పొట్ట ఎక్కువసేపు నిండినట్టు ఉంటుంది. కాబట్టి ఇతర ఆహారాలు తినకుండా ఉంటారు. 

జీడిపప్పులు ప్రతిరోజూ నాలుగు తినడం వల్ల బరువు సులువుగా తగ్గుతారు. 

జీడిపప్పులో ఐరన్, మెగ్నీషియంతో పాటూ అనేక రకాల విటమిన్లు అధికంగా ఉంటాయి. అవన్నీ ఆరోగ్యానికి మేలు చేస్తాయి.

జీడిపప్పులో ఫైబర్ అధికంగా ఉంటుంది. దీని గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. కాబట్టి రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గుతాయి. 

అతిగా ఆకలిని అవుతోందా? ఇవి తింటే కంట్రోల్‍లో ఉంటుంది!

Photo: Pexels