టార్గెట్ల రూపంలో నిత్యం పనిఒత్తిడితో ఉద్యోగులు పోరాటాలు చేస్తుంటారు. నిద్రాహారాలు మాని కష్టపడుతుంటారు. బిజీగాఉన్నప్పుడు కేవలం 10 నిమిషాల్లో మీ శక్తిని పెంచే 10 ఆహారాలు గురించి తెలుసుకుందాం.  

pexels

By Bandaru Satyaprasad
Sep 08, 2024

Hindustan Times
Telugu

అరటి పండులో కార్బోహైడ్రేట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలో గ్లూకోజ్, షుగర్ గా విడిపోయి తక్షణమే శక్తిని అందిస్తాయి. ఇందులోని పొటాషియం కండరాలు, నరాల పనితీరును మెరుగుపరుస్తుంది.  

pexels

చాలా మందికి తక్షణమే రీఛార్జ్ అవ్వడానికి కాఫీ ఉపయోగపడుతుంది. కాఫీలోని కెఫిన్... అడెనోసిన్ అనే న్యూరోట్రాన్స్ మీటర్ అడ్డుకుంటుంది. అది మిమ్మల్ని అలసిపోయినట్లు చేస్తుంది. అడెనోసిన్ ను అడ్డుకుని తక్షణ శక్తిని అందిస్తుంది.  

pexels

చియా విత్తనాలు చిన్నవే కానీ చాలా శక్తివంతమైనవి. ఇందులోని ఫైబర్, ప్రోటీన్, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ రక్తంలోని చక్కెరను స్థిరీకరించి తక్షణ శక్తి అందించడంలో సాయపడతాయి.  

pexels

డార్క్ చాక్లెట్ లో కెఫిన్, థియోబ్రోమిన్ ఉంటాయి. ఇవి శరీరానికి వెంటనే శక్తిని అందిస్తాయి. చక్కెర కలిగిన స్నాక్స్ తినడం వల్ల క్రాష్ లేకుండా వెంటనే శక్తిని అందిస్తాయి.  

pexels

వోట్స్ మీల్ లోని కార్బొహైడ్రేట్స్ శరీరానికి శక్తిని అందిస్తాయి. ఇందులోని ఫైబర్ కంటెంట్ రక్తంలో షుగర్ లెవల్స్ ను స్థిరీకరించడంలో సహాయపడుతుంది. రోజంతా ఎనర్జటిక్ ఉండేందుకు ఉపయోగపడుతుంది.  

pexels

గుడ్లు ప్రోటీన్ మూలం. శరీరానికి శక్తిని అందించడానికి అవసరమైన అమైనో యాసిడ్స్ కలిగి ఉంటాయి. ఇది మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది. ఏకాగ్రతను పెంచుతుంది. 

pexels

ఖర్జూరంలో ఫైబర్, గ్లూకోజ్, ఫ్రక్టోజ్, సుక్రోజ్ వంటి సహజ చక్కెరలు పుష్కలంగా ఉంటాయి. వీటిల్లోని యాంటీ ఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్ తో పోరాడటానికి సహాయపడతాయి. 

pexels

పెరుగులో ప్రోటీన్లు, హెల్తీ ఫ్యాట్స్, పిండి పదార్థాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి తక్షణ శక్తికి గొప్ప ఎంపిక. పెరుగులోని ప్రోబయోటిక్స్ గట్ ఆరోగ్యానికి మద్దతు ఇస్తాయి. ఇవి రోజంతా శక్తిని అందిస్తాయి.   

pexels

స్వీట్ పొటాటోస్ లో కార్బోహైడ్రేట్లు, ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇవి శరీరానికి స్థిరంగా శక్తిని అందిస్తాయి. ఇందులోని బీటా కెరోటిన్ రోగ నిరోధక వ్యవస్థకు మద్దతు ఇస్తుంది.  

pexels

బాదం, వాల్ నట్స్, జీడిపప్పు వంటి నట్స్ శక్తికి మూలకేంద్రాలు. వీటిల్లో ప్రోటీన్, హెల్తీ ఫ్యాట్స్, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరానికి శక్తిని అందిస్తాయి. వీటిలోని మెగ్నీషియం ఆహారాన్ని శక్తిగా మార్చేందుకు సహాయపడుతుంది.    

pexels

దోమల నివారణకు ఇంట్లోని వివిధ మూలల్లో మస్కిటో కాయిల్స్ పెట్టడం అలవాటు. దీని నుండి వచ్చే పొగ దోమలను నియంత్రిస్తుంది.

Unsplash