బ్రెస్ట్ ఫీడింగ్ చేయడం వల్ల బిడ్డకే కాదు తల్లికీ లాభమే

pixabay

By Haritha Chappa
Aug 02, 2024

Hindustan Times
Telugu

బ్రెస్ట్ ఫీడింగ్ ప్రతి తల్లీబిడ్డకు ఎంతో ముఖ్యమైనది. వారిద్దరి మధ్య అనుబంధాన్ని పెంచుతుంది.

pixabay

తల్లిపాలు తాగడం వల్ల బిడ్డకు ఎన్నో ప్రయోజనాలున్నాయని తెలిసిందే, అలాగే తల్లికి కూడా ఎంతో మంచిది. 

pixabay

 గర్భధారణ సమయంలో పెరిగిన బరువును బిడ్డకు పాలివ్వడం వల్ల తగ్గించుకోవచ్చు. 

pixabay

రొమ్ము క్యాన్సర్ వచ్చే ప్రమాదం నుంచి కూడా బిడ్డకు పాలిచ్చే తల్లి తప్పించుకోవచ్చు.

pixabay

రుమటాయిడ్ ఆర్ధరైటిస్ వంటి సమస్యలు తల్లులకు రాకుండా ఉండాలంటే బిడ్డకు కనీసం ఏడాది పాటూ పాలు ఇవ్వాలి.

pixabay

బిడ్డకు పాలివ్వడం వల్ల తల్లిలో ఆక్సిటోసిన్ అనే హార్మోన్ విడుదలవుతుంది. ఇది తల్లి ఆరోగ్యానికి ఎంతో మంచిది. 

pixabay

బిడ్డకు తల్లి పాలివ్వడం వల్ల కేవలం రొమ్ముక్యాన్సర్ మాత్రమే కాదు అండాశయ క్యాన్సర్ రాకుండా అడ్డుకుంటుంది. 

pixabay

బిడ్డకు పాలివ్వడం వల్ల పీరియడ్స్ రావడానికి ఆలస్యం అవుతుంది. దీని వల్ల రెండో ప్రెగ్నెన్సీకి కావాల్సిన సమయం లభిస్తుంది. 

pixabay

గుండెకు మేలు చేసే పొటాషియం పుష్కలంగా ఉండే ఫుడ్స్ ఇవి

Photo: Pexels