రక్తంలో ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాలు, థ్రాంబోసైట్లు లేదా ప్లేట్ లెట్ లు ఉంటాయి. వర్షాకాలంలో డెంగ్యూ, మలేరియా బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉండడం వల్ల ప్లేట్ లెట్ల సంఖ్య తగ్గుతుంది. ప్లేట్ లెట్ల సంఖ్యను పెంచే 7 ఆహారాల గురించి తెలుసుకుందాం.  

pexels

By Bandaru Satyaprasad
Nov 05, 2024

Hindustan Times
Telugu

గోధుమ గడ్డి- క్లోరోఫిల్ కంటెంట్ అధికంగా ఉండే గోధుమ గడ్డి ప్లేట్ లెట్ లను మాత్రమే కాకుండా ఎరుపు, తెల్ల రక్త కణాలను కూడా మెరుగుపరుస్తుంది. దీన్ని జ్యూస్ గా తీసుకోవచ్చు.  

pexels

గుమ్మడి కాయ- విటమిన్ ఎ అధికంగా ఉండే గుమ్మడి కాయ శరీరంలో ప్లేట్ లెట్స్ కౌంట్ ను పెంచడంతో సహాయపడుతుంది. విటమిన్ ఎ పుష్కలంగా ఉండే క్యారెట్, చిలగడదుంపలను కూడా తినవచ్చు. 

pexels

బొప్పాయి ఆకు రసం - డెంగ్యూ జ్వరం సమయంలో బొప్పాయి ఆకు రసం అద్భుతం చేస్తుంది. ప్లేట్ లెట్ కౌంట్ ను అతి త్వరగా పెంచుతుంది. బొప్పాయి రసం చేదుగా ఉంటుంది, దీనిని క్యాప్యూల్స్ రూపంలో తీసుకోవచ్చు.  

pexels

దానిమ్మ - దానిమ్మలోని ఐరన్ కంటెంట్ ప్లేట్ లెట్ల సంఖ్యను పెంచడంలో సహాయపడుతుంది. ఇందులో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఇన్ఫెక్షన్ల నుంచి త్వరగా కోలుకోవడానికి, వ్యాధి నిరోధక శక్తిని పెంచడానికి సహాయపడుతుంది.  

అలోవెరా - కలబంద అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలిగి ఉంటుంది. ఇది రక్తంలో ప్లేట్ లెట్ కౌంట్ ను నిర్వహించడంతో పాటు తెల్ల రక్త కణాల ఉత్పత్తిని ప్రోత్సహిస్తుంది.  

pexels

పాలు - పాలు కాల్షియం, ప్రోటీన్ కు గొప్ప మూలం. ఇందులో విటమిన్ కె కూడా ఉంటుంది. ఇది రక్తం గడ్డకట్టడానికి సహాయపడుతుంది. శరీరంలో ప్లేట్ లెట్ల కౌంట్ ను పెంచడానికి సహాయపడుతుంది.  

pexels

పాలకూర - పాలకూర వంటి ఆకుకూరలు ప్లేట్ లెట్ కౌంట్ ను మెరుగుపరచడంలో సహాయపడతాయి. వీటిలోని విటమిన్ కె రక్తం గడ్డకట్టడంలో సహాయపడతాయి.  

pexels

గుండెకు మేలు చేసే పొటాషియం పుష్కలంగా ఉండే ఫుడ్స్ ఇవి

Photo: Pexels