కాకరకాయ లేదా కరేలా మీ జుట్టుకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. జుట్టు రాలడాన్ని తగ్గించడానికి ఇంటి నివారిణిలా ఉపయోగించవచ్చు. జుట్టు పెరుగుదలకు కాకరకాయ ఎలా ఉపయోగించాలో తెలుసుకుందాం.
pexels
By Bandaru Satyaprasad Sep 23, 2024
Hindustan Times Telugu
కాకరకాయ రుచికి చేదుగా ఉన్నప్పటికీ రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించేందుకు, రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడానికి ఉపయోగపడుతుంది. దీంతో పాటు చుండ్రును నియంత్రించి, జుట్టు పెరుగుదలకు సహాయపడుతుంది.
pexels
జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకునేందుకు కాకరకాయను తినవచ్చు లేదా రసం తాగవచ్చు. కరేలా జ్యూస్ లో చిటికెడు ఉప్పు, నీరు కలిపి తాగవచ్చు.
twitter
కాకరకాయ రసం- తాజా కాకరకాయ నుంచి రసాన్ని తీసి దానిని మీ తలకు నేరుగా అప్లై చేయండి. అరగంట పాటు అలాగే ఉంచి, అధిక రసాయనాలు లేని షాంపూతో కడిగేయండి.
twitter
కాకరకాయ ముక్కలు- కాకరకాయ ముక్కలను తీసుకోండి. జుట్టు కుదుళ్లపై రెండు మూడు నిమిషాల పాటు సున్నితంగా రుద్దండి.
pexels
బిట్టర్ గార్డ్ హెయిర్ మాస్క్ - కాకరకాయ రసాన్ని పెరుగు లేదా కొబ్బరి నూనెతో కలపండి. దీన్ని ఒక హెయిర్ మాస్క్‌గా అప్లై చేసి, 15 నుంచి 20 నిమిషాల పాటు అలాగే ఉంచి తర్వాత శుభ్రం చేసుకోండి.
pexels
కాకరకాయ నూనె - కాకరకాయ నూనె లేకపోతే కొబ్బరి లేదా ఆలివ్ నూనెలో కొన్ని కాకరకాయ ముక్కలను వేయండి. స్కాల్ప్ మసాజ్ కోసం ఈ నూనెను ఉపయోగించండి.
pexels
కాకరకాయతో కొందరిలో అలెర్జీ, చర్మంపై దురద వచ్చే అవకాశం ఉంది. మితిమీరిన వినియోగం కొన్నిసార్లు అధిక స్కాల్ప్ నకు దారి తీస్తుంది. దీనిని ఉపయోగించే ముందు ప్యాచ్ టెస్ట్ చేసుకోండి.
pexels
డెంగ్యూ జ్వరం నుంచి కోలుకోవడానికి సరైనా ఆహారం చాలా కీలకం. కొన్ని రకాల పండ్లు, కూరగాయల జ్యూస్ లు సహజంగా ప్లేట్ లెట్ల సంఖ్యను పెంచుతాయి. రోగనిరోధక శక్తిని పెంచి, డెంగ్యూ నుంచి వేగంగా కోలుకోవడానికి సహాయపడతాయి.