సంతోషాన్ని పెంచే ‘డోపమీన్’ను శరీరంలో పెంచుకోండిలా...

Photo: Pixabay

By Chatakonda Krishna Prakash
Aug 03, 2023

Hindustan Times
Telugu

డోపమీన్ (Dopamine) రసాయనాన్ని ‘హ్యాపీ హార్మోన్’ అని కూడా పిలుస్తారు. శరీరంలో డోపమీన్ ఉత్పత్తి అయితే సంతోషం, ఉల్లాసం కలుగుతుంది. శరీరంలో డోపమీన్‍ను పెంచుకునే మార్గాలు ఇవే. 

Photo: Pixabay

మీ ఫేవరెట్ మ్యూజిక్ వినడం వల్ల ఒత్తిడి స్థాయి తగ్గి.. శరీరంలో డోపమీన్ ఎక్కువ విడుదల అవుతుంది. దీంతో మీ మూడ్ సంతోషంగా మారుతుంది. 

Photo: Pixabay

రెగ్యులర్‌గా వ్యాయామం చేయడం వల్ల శరీరం ఇండోఫిన్స్ రిలీజ్ చేస్తుంది. దీని వల్ల డొపమీన్ లెవెల్స్ పెరిగి.. హ్యాపీనెస్, సంతృప్తి ఫీలింగ్స్ పెరుగుతాయి.

Photo: Pixabay

శరీరంలో డోపమీన్ ఉత్పత్తి పెరగాలంటే ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి. ప్రొటీన్లు ఎక్కువగా ఉండే గుడ్లు, చికెన్, ఫిష్ లాంటివి తినాలి. అమినో యాసిడ్స్ ఉండే పదార్థాలు తీసుకుంటే డొపమీన్ ఎక్కువగా వెలువడుతుంది. 

Photo: Pixabay

మెడిటేషన్ చేయడం వల్ల కూడా శరీరంలో డోపమీన్ ఉత్పత్తి అధికమవుతుంది. ఒత్తిడి తగ్గుతుంది.

Photo: Pixabay

ఉదయం, సాయంత్రం ఎండలో ఉంటే శరీరంలో సెరెటోనిన్ విడుదల అవుతుంది. దీని ద్వారా మీ మూడ్ ఉల్లాసంగా మారి శరీరంలో డోపమీన్ లెవెల్స్ పెరుగుతాయి.

Photo: Pixabay

సరిపడినంత నిద్రించినా శరీరంలో డోపమీన్ లెవెల్స్ పెరుగుతాయి. అందుకే సంతోషంగా, ఉల్లాసంగా ఉండాలంటే సరిపడా నిద్రపోవాలి. 

Photo: Pixabay

అతిగా ఆకలిని అవుతోందా? ఇవి తింటే కంట్రోల్‍లో ఉంటుంది!

Photo: Pexels