బెల్లీ ఫ్యాట్ వేగంగా తగ్గేందుకు తోడ్పడే కూరగాయలు ఇవి
Photo: Pexels
By Chatakonda Krishna Prakash Sep 08, 2024
Hindustan Times Telugu
బెల్లీ ఫ్యాట్ (పొట్ట చుట్టూ ఉండే కొవ్వు) తగ్గాలంటే వ్యాయామాలు చేయడంతో పాటు సరైన ఆహారం తీసుకోవాలి. కొన్ని రకాల కూరగాయలు తినడం వల్ల బెల్లీ ఫ్యాట్‍ను వేగంగా తగ్గించుకునే అవకాశం ఉంది. ఆ కూరగాయలు ఏవంటే..
Photo: Pexels
గుమ్మడికాయల్లో క్యాలరీలు తక్కువగా ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇది తినడం వల్ల ఫ్యాట్ తగ్గుతుంది. గుమ్మడి కాయలను కర్రీలు, సలాడ్లు, స్మూతిలు, వెజిటబుల్స్ డ్రింక్స్ ఇలా వివిధ రకాలుగా తీసుకోవచ్చు.
Photo: Pexels
శరీరంలో బెల్లీ ఫ్యాట్ తగ్గేందుకు ‘ఆస్పరగస్’ చాలా ఉపయోగపడుతుంది. ఇందులో ఉండే ఆస్పరగస్ అనే రసాయనం కొవ్వును తగ్గించగలదు.
Photo: Pexels
క్యారెట్లలో క్యాలరీలు చాలా తక్కువగా ఉంటాయి. సోలబుల్, ఇన్‍సోలబుల్ ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. అందుకే ఇవి తింటే కొవ్వు కరిగేందుకు, బరువు తగ్గేందుకు తోడ్పడతాయి.
Photo: Pexels
ఫైబర్, విటమిన్లతో పాటు ‘బ్రోకలీ’లో ఫైతోకెమికల్స్ ఉంటాయి. శరీరంలో ఫ్యాట్ తగ్గేందుకు ఇవి సహకరిస్తాయి. క్యాలీఫ్లవర్, క్యాబేజీ కూడా ఫ్యాట్ తగ్గించేందుకు తోడ్పడతాయి.
Photo: Pexels
పాలకూర, కేల్ లాంటి ఆకుకూరల్లో చాలా పోషకాలు ఉంటాయి. శరీరంలో ఫ్యాట్ తగ్గేందుకు ఇవి చాలా ఉపయోగపడతాయి.
Photo: Pexels
శరీరంలో యూరిక్ యాసిడ్‍ను సహజంగా తగ్గించగల ఆహారాలు ఇవి