రోజంతా నిద్రమబ్బుగా అనిపిస్తోందా? ఈ టిప్స్ పాటించండి
Photo: Unsplash
By Chatakonda Krishna Prakash Mar 18, 2024
Hindustan Times Telugu
ఒక్కోసారి చాలా మందికి రోజంతా నిద్రమబ్బుగా అనిపిస్తుంది. డల్‍గా ఫీలవుతుంటారు. ఎనర్జీ తక్కువగా అనిపిస్తూ మత్తుగా ఉంటుంది. అయితే, ఇలాంటి ఫీలింగ్ పోయి.. యాక్టివ్‍గా అయ్యేందుకు ఈ టిప్స్ పాటించండి.
Photo: Pexels
నిద్రమబ్బుగా అనిపించిప్పుడు వెంటనే కాస్త వ్యాయామం చేయండి. దీంతో శరీరంలో రస్తప్రసరణ మెరుగై.. కండరాలు యాక్టివ్‍గా అవుతాయి. దీంతో డల్‍నెస్ తగ్గుతుంది.
Photo: Pexels
స్లీపీగా అనిపిస్తే ఓ కప్పు టీ లేకపోతే కాఫీ తాగండి. వీటిలో ఉండే కఫీన్ మిమ్మల్ని కాస్త చురుకుగా చేస్తుంది. అయితే, వీటిని రోజులో మరీ ఎక్కువసార్లు కూడా తాగకూడదు.
Photo: Pexels
మబ్బుగా అనిపించినప్పుడు వెంటనే ఓ గ్లాస్ నీరు తాగండి. దీంతో మీ శరీరం రిఫ్రెష్ అవుతుంది. యాక్టివ్‍గా ఉండేందుకు సరిపడా నీరు తాగుతూ నిరంతరం హైడ్రేటెడ్‍గా ఉండడం కూడా అవసరం.
Photo: Pexels
డల్‍గా అనిపించిన సందర్భాల్లో కాసేపు అలా ఎండలోకి వెళ్లండి. సూర్యరశ్మి వల్ల బాడీ యాక్టివ్ అవుతుంది. అలాగే, ఎండలోకి వెళ్లలేకపోతే.. ఎక్కువ వెతురు ఉండే లైట్ దగ్గరికి వెళ్లినా సరిపోతుంది.
Photo: Pexels
ఒకవేళ నిద్రమబ్బు విపరీతంగా ఉంటే.. వీలైతే ఓ పవర్ న్యాప్ వేయండి. అంటే 10 నుంచి 20 నిమిషాల పాటు నిద్రపోండి. ఆ తర్వాత లేవండి. దీంతో మీరు శరీర చురుకుదనం పెరిగే అవకాశం ఉంటుంది.