వేసవిలో కడుపు హాయిగా ఉండేందుకు ఈ టిప్స్ పాటించండి

Photo: Pexels

By Chatakonda Krishna Prakash
Apr 25, 2024

Hindustan Times
Telugu

వేసవికాలంలో వేడి విపరీతంగా ఉన్న కారణంగా జీర్ణవ్యవస్థకు ఇబ్బందిగా ఉండొచ్చు. కడుపులో కష్టంగా అనిపించొచ్చు. అయితే, వేసవిలో కడుపు పేగులు హాయిగా ఉండేందుకు ఈ ఐదు టిప్స్ పాటించండి. 

Photo: Pexels

వేసవిలో ప్రొబయోటిక్స్ ఎక్కువగా ఉండే పెరుగు, మజ్జిగ, యగర్ట్, కెఫిర్ లాంటివి ఎక్కువ తీసుకుంటూ ఉండాలి. వీటివల్ల వేసవిలో జీర్ణక్రియ మెరుగవుతుంది. కడుపు ఆరోగ్యంగా ఉండేందుకు ఉపయోగకరంగా ఉంటాయి. 

Photo: Pexels

కఫీన్ ఎక్కువగా ఉండే కాఫీ, టీల్లాంటివి వేసవిలో ఎక్కువగా తీసుకోకూడదు. ఇవి ఎక్కువగా తాగితే జీర్ణానికి ఇబ్బందికలుగుతుంది.  తప్పదనుకుంటే రోజులో రెండు కప్‍ల్లోపే తీసుకోవాలి. బ్లాక్ టీ, గ్రీన్ టీ లాంటివి బెస్ట్. 

Photo: Pexels

ఎండాకాలంలో ఫైబర్ ఎక్కువగా ఉండే పప్పు ధాన్యాలు, కూరగాయాలు, పండ్లు, కాయధాన్యాలు ఆహారంలో తీసుకోవాలి. దీనివల్ల పేగుల కదలికలు మెరుగ్గా ఉంటాయి. జీర్ణక్రియకు మేలు జరుగుతుంది. 

Photo: Pexels

జీర్ణక్రియ మెరుగ్గా ఉండేందుకు సరిపడా నీరు తాగడం చాలా ముఖ్యం. వేసవిలో నిరంతరం హైడ్రేటెడ్‍గా ఉండాలి. ద్రవాలు ఎప్పకప్పుడు తీసుకుంటూనే ఉండాలి. హైడ్రేషన్ అందించే పండ్లు తినాలి. 

Photo: Pexels

వేసవిలో ముఖ్యంగా ఆహారంలో కాస్త పసుపును ఎక్కువగానే తీసుకోవాలి. స్మూతీస్, సూప్‍ల్లో పసుపు వేసుకోవాలి. అలాగే, పాలల్లో పసుపు వేసుకొని తాగడం కూడా చాలా మంచిది. ఇది కడుపులో మంటను తగ్గించలగదు. జీర్ణాన్ని మెరుగుచేయగలదు. 

Photo: Pexels

పాత్రలను సరిగ్గా క్లీన్ చేయడం తెలియకపోతే అందులోని క్రిములు వివిధ ఆరోగ్య సమస్యలకు దారితీస్తాయి. సరిగ్గా క్లీన్ చేయకపోతే వంట పాత్రలపై నూనె మరకలు, జిడ్డు, ఆహార గుర్తులు అలానే ఉండిపోతాయి. అందుకే వీటిని ఎఫెక్టివ్ గా క్లీన్ చేసే పద్దతులు తెలుసుకుందాం.  

pexels