కిడ్నీల ఆరోగ్యాన్ని మెరుగుపరిచే జ్యూస్‍లు ఇవి

Photo: Pexels

By Chatakonda Krishna Prakash
Feb 02, 2024

Hindustan Times
Telugu

శరీరంలోని విసర్జన వ్యవస్థలో కిడ్నీలు (మూత్రపిండాలు) చాలా ముఖ్యమైన భాగం. అందుకే ఇవి ఆరోగ్యంగా ఉండడం చాలా కీలకం. కిడ్నీల ఆరోగ్యానికి మేలు చేసే జ్యూస్‍లు ఇవి.

Photo: Pexels

బీట్‍‍‍రూట్ జ్యూస్‍లో బీటైన్ సహా మరిన్ని పోషకాలు ఉంటాయి. ఇది తాగడం వల్ల శరీరంలో రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. దీంతో కిడ్నీల ఆరోగ్యానికి బీట్‍రూట్ మేలు చేస్తుంది. 

Photo: Pexels

నిమ్మరసంలో విటమిన్ సీ పుష్కలంగా ఉంటుంది. ఇందులో డిటాక్సిఫయింగ్ గుణాలు అత్యధికంగా ఉంటాయి. దీంతో నిమ్మరసం కిడ్నీల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. 

Photo: Pexels

ఆలోవెరా జ్యూస్ కూడా కిడ్నీల ఆరోగ్యానికి మేలు చేస్తుంది. 

Photo: Pexels

టమాటా జ్యూస్‍లో సిట్రిక్ యాసిడ్ ఉంటుంది. దీంతో ఇది తాగితే మూత్రపిండాల ఆరోగ్యానికి మంచి జరుగుతుంది. 

Photo: Pexels

కోరదోస జ్యూస్ కూడా కిడ్నీల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. కీరదోసలో యాంటీయాక్సిడెంట్లు, నేచురల్ వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటాయి. 

Photo: Pexels

గుండెకు మేలు చేసే పొటాషియం పుష్కలంగా ఉండే ఫుడ్స్ ఇవి

Photo: Pexels