భోజనం చేసిన తర్వాత నేరుగా పడుకోవడం వల్ల తిన్న ఆహారం సరిగా జీర్ణం కాకపోవడం, ఉదయం నిద్ర లేవగానే అజీర్తికి దారితీయవచ్చు.
Unsplash
By Anand Sai Apr 11, 2024
Hindustan Times Telugu
అజీర్తి, గ్యాస్ సమస్యను నివారించడానికి మీరు తిన్న తర్వాత కచ్చితంగా నడవాలి.
Unsplash
రాత్రి భోజనం చేసిన తర్వాత నడవడం వల్ల అనేక రోగాల నుంచి రక్షణ పొందవచ్చు. గుండె ఆరోగ్యంగా ఉండాలంటే భోజనం చేసిన తర్వాత కూడా నడవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
Unsplash
మీరు ఎంత సమయం, ఏ వేగంతో నడవాలి అని కూడా తెలుసుకోవాలి.
Unsplash
రాత్రి 7 గంటల లోపు తినాలని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. రాత్రి భోజనం చేసిన వెంటనే నడకకు వెళ్లవద్దు.
Unsplash
భోజనం చేసిన తర్వాత కనీసం గంట తర్వాత నడకకు వెళ్లడం ఆరోగ్యానికి మంచిది. ఎల్లప్పుడూ రాత్రిపూట చురుకైన నడకను నివారించండి. వీలైనంత నెమ్మదిగా నడవండి.
Unsplash
మధ్యాహ్న భోజనం తర్వాత, అరగంట నుండి గంట వరకు సాధారణ నడక చేయాలి. చాలా వేగంగా నడవడం వల్ల మీ కడుపులో నొప్పి వస్తుంది.
Unsplash
రాత్రి భోజనం తర్వాత వాకింగ్ చేయడం వల్ల మీ రోగనిరోధక శక్తి పెరుగుతుంది. మీరు అనేక రకాల సీజనల్ వ్యాధుల నుండి రక్షించబడతారు.