బొప్పాయి పండులోని విత్తనాలను చాలా మంది పడేస్తుంటారు. అయితే వీటిలో చాలా పోషకాలు ఉంటాయి. బొప్పాయి విత్తనాలు తినేందుకు కాస్త వగరుగా ఉన్నా ఆరోగ్యానికి మేలు చేస్తాయి. బొప్పాయి గింజలు తినడం వల్ల కలిగే ముఖ్యమైన ఆరోగ్య ప్రయోజనాలు ఇవే.
Photo: Pexels
బొప్పాయి గింజలను నేరుగా కాకున్నా సలాడ్లు, స్మూతీల్లో వేసుకొని తీసుకోవచ్చు. లేకపోతే ఈ గింజలను ఎండపెట్టి ఆ తర్వాత పొడి చేసుకొని సలాడ్లు, ఫుడ్‍లో చల్లుకొని తినొచ్చు.
Photo: Pexels
బొప్పాయి విత్తనాల్లో డైయటరీ ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది జీవక్రియలను మెరుగుపరస్తుంది. బరువు తగ్గేందుకు ఈ విత్తనాలు ఉపకరిస్తాయి.
Photo: Pexels
బొప్పాయి గింజల్లో విటమిన్ సీ మెండుగా ఉంటుంది. దీంతో ఇవి తింటే శరీరంలో రోగ నిరోధక శక్తి మెరుగవుతుంది.
Photo: Pexels
బొప్పాయి విత్తనాల్లో ఉండే కార్పైన్, ఫైబర్.. పేగుల కదలికలను నియంత్రిస్తాయి. దీని ద్వారా మలబద్దకం తగ్గేందుకు ఉపకరిస్తాయి. జీర్ణక్రియకు మేలు చేస్తాయి.
Photo: Pexels
బొప్పాయి విత్తనాల్లో ఉండే కరోటీన్.. ఈస్ట్రోజెన్ సమతుల్యంగా ఉండేందుకు సహకరిస్తుంది. దీనివల్ల మహిళల నెలసరి సమయంలో నొప్పి తగ్గేందుకు ఈ విత్తనాలు తోడ్పడతాయి.
Photo: Pexels
చలికాలంలో ఈ జ్యూస్‍తో మెండుగా రోగ నిరోధక శక్తి.. రోజూ తాగండి!