ద్రాక్ష పండ్లను రోజూ తింటే ఎన్ని ప్రయోజనాలు ఉంటాయో తెలుసా?

Photo: Pexels

By Chatakonda Krishna Prakash
Dec 04, 2023

Hindustan Times
Telugu

ద్రాక్ష పండ్లలో చాలా పోషకాలు ఉంటాయి. వీటిని ప్రతీ రోజు తింటే ఆరోగ్యానికి మేలు జరుగుతుంది. ద్రాక్ష పండ్లను రోజూ తినడం వల్ల ఆరోగ్యానికి కలిగే 5 లాభాలను ఇక్కడ తెలుసుకోండి. 

Photo: Pexels

ద్రాక్ష పండ్లను తినడం వల్ల జీర్ణక్రియ మెరుగవుతుంది. మలబద్ధకాన్ని నివారించటంతో పాటు ఉదర ఆరోగ్యానికి ద్రాక్ష మేలు చేయగలదు. 

Photo: Pexels

ద్రాక్ష పండ్లలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. కణాలు డ్యామేజ్ అవకుండా ఈ పండ్లు నివారించగలవు. గుండె సంబంధింత, డయాబెటిస్ వ్యాధుల రిస్కును కూడా ద్రాక్ష తగ్గించగలదు. 

Photo: Pexels

ద్రాక్షలో యాంటీయాక్సిడెంట్లతో పాటు పోలిఫెనాల్స్ కూడా ఎక్కువగా ఉంటాయి. దీంతో శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు, బ్లడ్ ప్లజెర్‌ తగ్గేందుకు ద్రాక్ష తోడ్పడుతుంది. గుండె ఆరోగ్యానికి మేలు జరుగుతుంది. 

Photo: Pexels

ప్రతీ రోజు ద్రాక్ష తినడం వల్ల చర్మానికి కూడా మంచిది. చర్మంపై ముడతలను, దద్దుర్లను నివారిస్తుంది. 

Photo: Pexels

ద్రాక్ష పండ్లలో విటమిన్ సీ పుష్కలంగా ఉంటుంది. దీంతో ఇవి తింటే రోగ నిరోధక శక్తి మెరుగవుతుంది. కొన్ని రకాల ఇన్ఫెక్షన్ల నుంచి రక్షణ కలుగుతుంది. 

Photo: Pexels

ద్రాక్ష పండ్లలో క్యాలరీలు తక్కువగా, వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి.. బరువు తగ్గాలనుకునే వారు కూడా ద్రాక్ష తినొచ్చు. వెయిట్ లాస్‍కు కూడా ద్రాక్ష తోడ్పడుతుంది.

Photo: Pexels

దురదగొండి ఆకులో అద్భుత ఔషధ గుణాలు