ప్రతి రోజూ సరిపడా నీళ్లు తాగితే ఎన్నో ఆరోగ్య సమస్యలు దూరం అవుతాయని నిపుణులు చెబుతున్నారు.

image credit to unsplash

By HT Telugu Desk
Sep 13, 2023

Hindustan Times
Telugu

వాతావరణం చల్లగా ఉన్నప్పుడు గోరువెచ్చటి నీళ్లు తాగితే బద్ధకం తగ్గి యాక్టివ్‌గా ఉంటారు.

image credit to unsplash

అధిక బరువు సమస్యతో బాధపడుతున్న వారు రోజు వేడి నీరు తీసుకోవటం వల్ల సులభంగా బరువు తగ్గేందుకు అవకాశం ఉంటుంది. 

image credit to unsplash

శరీరంలో పేరుకుపోయిన కొవ్వు కరిగించడానికి వేడి నీళ్లు సహాయపడతాయి. గోరువెచ్చటి నీళ్లలో నిమ్మరసం వేసుకుని తాగడం వల్ల బరువు తగ్గొచ్చు.

image credit to unsplash

ఉదయం నిద్ర లేవ గానే కాలకృత్యాలు తీర్చుకోక ముందే రెండు లేదా మూడు గ్లాసులు గోరు వెచ్చని నీళ్లు తాగంటం వల్ల ప్రయోజనం ఉంటుంది. 

image credit to unsplash

నెలసరిలో వచ్చే అనేక సమస్యలు గోరువెచ్చటి నీళ్లతో పరిష్కారమవుతాయి. ఆ సమయంలో కలిగే విసుగూ అలసటా తగ్గుతాయి

image credit to unsplash

కడుపు నొప్పి, అజీర్తి తదితర జీర్ణ సమస్యలతో బాధపడేవారు వేడి నీళ్లు తాగితే మంచిది. వేడి నీళ్లు తాగితే ఆహారం త్వరగా జీర్ణం అవుతుంది.

image credit to unsplash

చల్లటి నీళ్లు తాగడం వల్ల పంటి సెన్సిటివిటీ పెరిగిపోతుంది. అదే వేడి నీళ్లు తాగితే క్రిములు చచ్చిపోయి దంత సమస్యలు తగ్గుతాయి.

image credit to unsplash

 సరైన శరీర బరువును కోసం పాటించాల్సిన టిప్స్ ఇవి

Photo: Pexels