బెల్లం టీ వల్ల ఆరోగ్యానికి కొన్ని ప్రయోజనాలు కలుగుతాయి. వర్షాకాలంలో వచ్చే కొన్ని సీజనల్ వ్యాధుల నుంచి కూడా ఇది ఉపశమనం కలిగించగలదు. వానకాలంలో బెల్లం టీ తాగడం వల్ల కలిగే లాభాలు ఇవే.
Photo: Pexels
శ్వాసకు సంబంధించిన ఇబ్బందులను బెల్లం టీ తగ్గించగలదు. జబులు, దగ్గు లాంటి వాటి నుంచి కాస్త ఉపశమనం ఇస్తుంది. వానకాలంలో బెల్లం టీ తాగడం మేలు చేస్తుంది.
Photo: Pexels
బెల్లం టీలో సెలేనియం, జింక్ లాంటి పోషకాలు ఉంటాయి. శరీరంలో రోగనిరోధక శక్తి మెరుగుపడేందుకు ఇవి సహకరిస్తాయి.
Photo: Pexels
బెల్లం టీ తాగడం వల్ల శరీరంలోని వ్యర్థాలు సులువుగా బయటికి వెళ్లేందుకు తోడ్పడుతుంది. రక్త ప్రసరణ మెరుగ్గా ఉండేందుకు కూడా ఈ టీ సహకరిస్తుంది.
Photo: Pexels
బెల్లం టీలో పోటాషియం పుష్కలంగా ఉంటుంది. దీంతో ఇది తాగితే బ్లడ్ ప్రెజర్ కూడా నియంత్రణలో ఉండేందుకు సాయపడుతుంది.
Photo: Pexels
జీర్ణ ఇబ్బందులు, వాంతులు, డయేరియా నుంచి కూడా బెల్లం టీ కాస్త ఉపశమనం ఇవ్వగలదు. ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల జీర్ణక్రియ కూడా మెరుగవుతుంది.
Photo: Pexels
గర్భం సమయంలో మహిళలు జంక్ ఫుడ్ తింటే ఎన్నో ఆరోగ్య సమస్యలు.. జాగ్రత్త!