గాలాపాగోస్ దీవులు, ఈక్వెడార్- ఈ దీవులు 1978లో యునెస్కో వరల్డ్ హెరిటేజ్ లిస్ట్‌లో చేరాయి. గాలాపాగోస్ బీచ్‌లు అద్భుతమైన ప్రకృతి సౌందర్యం, ప్రత్యేకమైన వన్యప్రాణులు పర్యాటకులను ఆకర్షిస్తున్నాయి.   

unsplash

By Bandaru Satyaprasad
Nov 27, 2023

Hindustan Times
Telugu

గ్రేట్ బారియర్ రీఫ్, ఆస్ట్రేలియా- ఇది 2,300 కిలోమీటర్ల మేర విస్తరించి ఉంది. ప్రపంచంలోనే అతిపెద్ద పగడపు దిబ్బల సమూహం. గ్రేట్ బారియర్ రీఫ్‌లో 1,500 రకాల చేపలు, 4000 రకాల మొలస్క్‌లు, 400 రకాల కోరల్స్ (పగడపు దిబ్బలు) ఉన్నాయి. గ్రేట్ బారియర్ రీఫ్ బీచ్‌లు పర్యాటకులకు ప్రధాన ఆకర్షణలలో ఒకటి.   

unsplash

సిన్క్యూ టెర్రే, ఇటలీ- ఇటాలియన్ రివేరా తీరం వెంబడి ఉన్న ఐదు రంగుల మత్స్యకార గ్రామాల సమూహం. అద్భుతమైన ప్రకృతి సౌందర్యం, ప్రతి గ్రామాన్ని కలిపే హైకింగ్ ట్రయల్స్‌ ఇక్కడ ప్రసిద్ధి.  పర్యాటకులు తీరం వెంబడి బోటులో ప్రయాణం చేయవచ్చు.  

unsplash

 హా లాంగ్ బే, వియత్నాం- ఉత్తర వియత్నాంలో ఉన్న ఈ ప్రాంతం ఓ సహజ అద్భుతం. అద్భుతమైన సున్నపురాయి శిఖరాలు, గుహలను చూడటానికి పర్యాటకులు వస్తుంటారు.  

unsplash

స్టోన్ టౌన్, జాంజిబార్, టాంజానియా- స్టోన్ టౌన్ అనేది టాంజానియా తీరంలోని జాంజిబార్ ద్వీపంలో ఉన్న ఒక చారిత్రక పట్టణం. ఈ పట్టణం ఎంతో సుందరమైన బీచ్‌లకు నిలయంగా ఉంది. తెల్లటి ఇసుక, స్వచ్ఛమైన నీటికి ఈ బీచ్ లు ప్రసిద్ధి.  

unsplash

రాపా నుయి, చిలీ- దీనిని ఈస్టర్ ఐలాండ్ అని పిలుస్తారు. రాపా నుయి పసిఫిక్ మహాసముద్రం మధ్యలో ఉన్న ఒక ద్వీపం. ఈ ప్రదేశం రహస్యమైన మోయి విగ్రహాలకు ప్రసిద్ధి చెందింది. ఈ ద్వీపంలో ఎంతో అందమైన బీచ్‌లు ఉన్నాయి. అనకేనా బీచ్ లో తెల్లని ఇసుక, స్పష్టమైన నీలి నీటికి ప్రసిద్ధి.   

unsplash

లాగూన్స్ ఆఫ్ న్యూ కాలెడోనియా, ఫ్రాన్స్- నైరుతి పసిఫిక్‌లో ఉన్న ఈ ప్రదేశం ఆరు వేర్వేరు పగడపు దిబ్బల సమూహం. నీటి అడుగున ప్రపంచాన్ని అన్వేషించడానికి ఇది చక్కటి ప్రాంతం. స్పష్టమైన జలాలు, సమృద్ధిగా ఉన్న సముద్ర జీవులకు ఈ ప్రాంతం ప్రసిద్ధి. స్కూబా డైవింగ్ ను ఆస్వాదించవచ్చు.   

unsplash

బెలిజ్ బారియర్ రీఫ్ సిస్టమ్, బెలిజ్- మధ్య అమెరికాలోని బెలిజ్ తీరంలో ఉన్న యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశం. ప్రపంచంలో రెండో అతిపెద్ద రీఫ్ వ్యవస్థ.  పర్యాటకులు పగడపు దిబ్బలు, నీటి అడుగున గుహలను అన్వేషించడానికి ఈత, స్నార్కెలింగ్, స్కూబా డైవింగ్ చేయవచ్చు.   

unsplash

రెడ్‌వుడ్ నేషనల్ స్టేట్ పార్క్, యూఎస్ఏ- ఉత్తర కాలిఫోర్నియాలో ఉన్న ఈ ప్రాంతం ఎత్తైన రెడ్‌వుడ్ చెట్లకు ప్రసిద్ధి. సందర్శకులు రెడ్‌వుడ్‌ల తోటలను అన్వేషించడానికి అడవి గుండా ప్రయాణించవచ్చు. క్రెసెంట్ బీచ్‌ లో సర్ఫింగ్, టైడ్‌పూలింగ్ చేయవచ్చు.  

unsplash

తుబ్బతహా రీఫ్స్ నేచురల్ పార్క్, ఫిలిప్పీన్స్- ఇది సులు సముద్రంలో ఉన్న మెరైన్ పార్క్. 600 రకాల చేపలు, 360 జాతుల కోరల్స్, విభిన్న సముద్ర జీవులకు నిలయం.  సొరచేపలు, ఇతర సముద్ర జీవులను చూసేందుకు డైవింగ్‌కు వెళ్లవచ్చు 

unsplash

హిస్టారిక్ టౌన్ ఆఫ్ సెయింట్ జార్జ్, బెర్ముడా- ఈ ప్రాంతం అద్భుతమైన వాస్తుశిల్పాలు, బీచ్‌లకు ప్రసిద్ధి. పర్యాటకులు సెయింట్ జార్జ్ కొబ్లెస్టోన్ వీధులను అన్వేషించవచ్చు.  బీచ్ అనుభవం కోసం టొబాకో బే కు వెళ్లవచ్చు.   

unsplash

క్రంచీరోల్ యానిమే అవార్డ్స్ ఈవెంట్ కోసం జ‌పాన్ వెళ్లింది ర‌ష్మిక మంద‌న్న‌. 

twitter