ఆయుర్వేదం ప్రకారం కొన్ని ఆహారాల కలయిక జీర్ణ సమస్యలు, శరీరంలో టాక్సిన్స్ విడుదల, ఆరోగ్య సమతుల్యతను దెబ్బతీస్తాయి. ఆయుర్వేద నిపుణలు ఈ 10 ఆహార కలయికలను వద్దని సూచిస్తున్నారు.  

pexels

By Bandaru Satyaprasad
Sep 17, 2024

Hindustan Times
Telugu

తేనె, నెయ్యి - తేనె, నెయ్యి సమాన నిష్పత్తిలో కలిపితే విషపూరితంగా మారుతుందని ఆయుర్వేద నిపుణలు తెలిపారు. ఇది శరీరంలో హానికరమైన పదార్థాలను ఉత్పత్తి చేస్తుందని అంటున్నారు. వివిధ ఆరోగ్య సమస్యలకు దారితీయవచ్చు.  

pexels

చేప, పెరుగు - పెరుగును చేపలతో కలిపి తింటే జీర్ణ సమస్యలు రావడం, శరీరంలో హానికరమైన పదార్థాల ఉత్పత్తికి దారితీస్తాయి. 

pexels

ముల్లంగి, పాలు - ముల్లంగి, పాలను కలిపి తీసుకోవడం ఆయుర్వేదం ప్రకారం హానికరం. ఎందుకంటే ఇది జీర్ణ క్రియకు అసౌకర్యాన్ని కలిగిస్తుంది. గ్యాస్ ను దారితీస్తుంది.  

pexels

తేనె, వెచ్చని నీరు- తేనెను వేడిచేయడం ఆయుర్వేదంలో అసాధారణంగా భావిస్తారు. తేనేను వేడి చేసినప్పుడు అది విషపూరితంగా మారవచ్చు. వేడి ద్రవాలతో తేనె కలపడం అంత మంచిది కాదని అంటున్నారు.    

pexels

పాలు, ఉప్పు - పాలను ఉప్పుతో కలపడం వల్ల రెండు పదార్థాలు వాటి లక్షణాలు కోల్పోయే అవకాశం ఉంది. దీంతో శరీరానికి తక్కువ ప్రయోజనం, అలాగే జీర్ణ సమస్యలతు దారితీయవచ్చు.  

pexels

అరటి, పాలు - అరటి పండు, పాలు కలిపి తినడం వల్ల జీర్ణ సమస్యలు వస్తాయి. ఇది జలుబు, అలెర్జీలకు కారణం కావొచ్చు.  

pexels

పండ్లు, కూరగాయలు - ఆయుర్వేదం ప్రకారం పండ్లు, కూరగాయలతో ఒకే భోజనం వద్దని సూచిస్తుంది. ఇది జీర్ణ సమస్యలకు దారితీయవచ్చు.  

pexels

ఇతర పండ్లతో పుచ్చకాయలు - పుచ్చకాయలను ఇతర పండ్లతో కలిపి తినొద్దని ఆయుర్వేదం సూచిస్తుంది. ఎందుకంటే పుచ్చకాయ త్వరగా జీర్ణం అవుతుంది. వీటిని ఇతర పండ్లతో కలిపినప్పుడు జీర్ణ సమస్యకు దారితీస్తుంది.  

pexels

పాలు, పండ్లు - సాధారణంగా పచ్చి పండ్లతో పాలు తీసుకోవడం వల్ల జీర్ణ క్రియకు అంతరాయం ఏర్పడి శరీరంలో టాక్సిన్స్ ఏర్పడతాయని ఆయుర్వేదం సూచిస్తోంది. ఈ కలయిక ఉబ్బరం, జీర్ణ అసౌకర్యానికి కారణం కావొచ్చు.  

pexels

పాలు, చేప - పాలు, చేపలు కలిపి తీసుకోవడం వల్ల జీర్ణ సమస్యలు తలెత్తుతాయి. శరీరంలో అసమతుల్యత ఏర్పడే అవకాశం ఉందని ఆయుర్వేదం చెబుతోంది.(ఈ వెబ్ స్టోరీ ఇంటర్నెట్ ఆధారిత సమాచారం,  మీ అవగాహన కోసం మాత్రమే)  

pexels

గుండెకు మేలు చేసే పొటాషియం పుష్కలంగా ఉండే ఫుడ్స్ ఇవి

Photo: Pexels