ఆస్ట్రాజెనెకా కోవిషీల్డ్ కరోనా వ్యాక్సిన్ తో చాలా అరుదుగా సందర్భాల్లో సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయని అంగీకరించింది. యూకే కోర్టులో సమర్పించిన పత్రాల్లో ఈ విషయాన్ని ఆస్ట్రాజెనెకా నిర్థారించింది.
pexels
By Bandaru Satyaprasad May 01, 2024
Hindustan Times Telugu
కోవిషీల్డ్ వ్యాక్సిన్ ప్రభావంతో థ్రోంబోసైటోపెనియా సిండ్రోమ్ (TTS)తో థ్రాంబోసిస్‌కు కారణమవుతుందని ఆస్ట్రాజెనెకా అంగీకరించింది. అంటే చాలా అరుదైన సందర్భాల్లో రక్తం గడ్డకట్టడం, సంబంధిత దుష్ప్రభావానికి కారణమవుతుందని తెలిపింది.
pexels
థ్రోంబోసైటోపెనియా సిండ్రోమ్ థ్రాంబోసిస్(TTS)- కోవిడ్-19 వ్యాక్సినేషన్ తర్వాత సంభవిస్తున్న ఒక విపరీతమైన ఇమ్యునోలాజికల్ రియాక్షన్. ఇది ప్లేట్‌లెట్స్, కోగ్యులేషన్ సిస్టమ్ యాక్టివేషన్‌కు దారి తీస్తుంది.
pexels
టీటీఎస్ లో సిరలు లేదా ధమనుల థ్రాంబోసిస్‌కు కారణమవుతుంది. కొన్ని పరిస్థితులలో సెకండరీ రక్తస్రావానికి దారితీయవచ్చని వైద్యులు అంటున్నారు.
pexels
టీటీఎస్ లక్షణాలు - కోవిషీల్డ్ గ్రహీతల్లో యువకులు, మొదటి డోస్ తీసుకున్న వారిలో సైతం ఈ ప్రభావం కనిపిస్తుంది. శరీరంలో కొన్ని చోట్ల రక్తస్రావం లేదా గడ్డకట్టడం జరుగుతుందని వైద్యు్లు తెలిపారు. ఫోకల్ న్యూరోలాజికల్ లక్షణాలతో పాటు తలనొప్పి క్రమంగా తీవ్రమవుతుందని వైద్య నిపుణులు తెలిపారు.
pexels
ఈ సిండ్రోమ్ లో శరీర దిగువ భాగాలు(నడుము నుంచి), ఊపిరితిత్తులలో థ్రాంబోసిస్‌ను కనిపిస్తుందని వైద్యులు అన్నారు. ప్లీనిక్, పోర్టల్ లేదా మెసెంటెరిక్, అడ్రినల్, సెరిబ్రల్, ఆప్తాల్మిక్ సిరలు నుంచి గట్ కు రక్తం సరఫరా చేసే నాళాలలోని ప్రదేశాలలో రక్తం గడ్డకట్టవచ్చన్నారు.
pexels
కోవిడ్ కాంప్లికేషన్స్ తో వస్తున్న రోగులు ఎక్కువగా కోవిషీల్డ్ తీసుకున్న వారేనని వైద్యులు అంటున్నారు. వీళ్లు స్ట్రోక్స్, కార్డియాక్ కాంప్లికేషన్‌లను ఎదుర్కొన్నట్లు వైద్యులు తెలిపారు.
pexels
అరిథ్మియా, కార్డియాక్ అరెస్ట్, డయాబెటిక్ వంటి సమస్యలలో ఒకటి థ్రాంబోసైటోపెనియా సిండ్రోమ్, ఇది రక్త నాళాలలో రక్తం గడ్డకట్టేలా చేస్తుందని వైద్యులు తెలిపారు. పొత్తికడుపు నొప్పి, కాళ్ల వాపు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటుదని తెలిపారు.
pexels
టీటీఎస్ రోగులకు చికిత్స చేస్తున్నప్పుడు, కార్డియాలజిస్టులు థ్రాంబోసిస్, రక్తస్రావం సమస్యలను జాగ్రత్తగా పరిశీలించాలని వైద్య నిపుణులు అంటున్నారు. థ్రాంబోసిస్ భారాన్ని తగ్గించడానికి ప్రతి రోగి రిస్క్ ప్రొఫైల్, సపోర్టింగ్ డాక్యుమెంటేషన్‌ను పూర్తిగా అంచనా వేయాలి.
pexels
చలికాలంలో జలుబు, వైరల్ ఫ్లూ సర్వసాధారణంగా వస్తుంటాయి. జలుబు, ఫ్లూ, సీజనల్ మార్పులు కారణంగా శీతాకాలంలో గొంతు సమస్యలు వస్తుంటాయి.