అసోం వరదలకు అల్లాడిపోతున్న ప్రజలు- 58మంది మృతి

ANI

By Sharath Chitturi
Jul 07, 2024

Hindustan Times
Telugu

నైరుతి రుతుపవనాల ప్రభావం అసోంపై ఎప్పుడూ తీవ్రంగానే ఉంటుంది. 2024లోనూ పరిస్థితులు అత్యంత ప్రతికూలంగా ఉన్నాయి.

ANI

రాష్ట్రంలోని చాలా ప్రాంతాలు నీట మునిగాయి. ప్రధాన రహదారుల్లో నీరు పేరుకుపోయింది. అనేక గ్రామాలకు కనెక్షన్​ తెగిపోయింది.

ANI

అసోం రాష్ట్ర విపత్తు నిర్వహణ బృందం ప్రకారం రాష్ట్రంలో ఇప్పటికే 58మంది మరణించారు. 23లక్షల మంది ప్రభావిత ప్రాంతాల్లో ఉన్నారు.

ANI

అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ.. ముప్పు ప్రాంతాల్లో పర్యటించి, అక్కడి ప్రజలకు ధైర్యం చెప్పారు.

ANI

నిమాటీఘాట్​, తేజ్​పూర్​, ధుర్బి, గోల్​పారాలో బ్రహ్మపుత్రతో పాటు ఇతర నదులు డెంజర్​ మార్క్​ని దాటి ప్రమాదకరంగా ప్రవహిస్తున్నాయి.

ANI

27 జిల్లాల్లో 577 సహాయక శిబిరాలను ఏర్పాటు చేశారు. 5.26లక్షల మంది షెల్టర్​ క్యాంపుల్లో నివాసముంటున్నారు.

ANI

అసోం వరదలకు 3,535 గ్రామాలు నిటమునిగాయి. 68,768.5 హెక్టార్ల పంట భూమి దెబ్బతింది.

ANI

మలబద్ధకం సమస్యను తగ్గించగల 5 రకాల డ్రింక్స్

Photo: Pexels