బరువు పెరగాలనుకుంటున్నారా? ఈ టిప్స్ పాటించండి

Photo: Pexels

By Chatakonda Krishna Prakash
Sep 07, 2024

Hindustan Times
Telugu

కొందరు ఉండాల్సిన దాని కంటే తక్కువ బరువుతో ఉంటారు. అలాంటి వారు వెయిట్ ఎక్కువయ్యేందుకు ప్రయత్నిస్తుంటారు. బరువు పెరిగేందుకు ఉపయోగపడే టిప్స్ ఇవే. 

Photo: Pexels

ప్రోటీన్లు, కార్బొహైడ్రేట్లు, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉండే పాలు, అన్నం, బంగాళదుంప లాంటి ఆహారాలు  తింటే బరువు వేగంగా పెరగొచ్చు. వీటిలో పోషకాలు ఉండటంతో పాటు సాచురేటెడ్ ఫ్యాట్స్ ఉంటాయి. 

Photo: Pexels

కండరాలు పెరిగే వర్కౌట్లు ప్రతీరోజు చేయాలి. బరువు సరైన స్థాయిలో ఉండేందుకు ఈ వ్యాయామం ఉపయోగపడుతుంది. అలాగే ఎక్కువగా తిన్నా ఊబకాయం రాకుండా చేస్తుంది. 

Photo: Pexels

బరువు పెరిగేందుకు జంక్, ప్రాసెస్డ్ ఫుడ్స్ తినకూడదు. ఇవి తింటే అనారోగ్యకరమైన ఫ్యాట్ ఏర్పడుతుంది. అందుకే పోషకాలు ఉండే ఆహారం తీసుకోవాలి. బ్యాలెన్డ్స్ డైట్ తీసుకోవాలి.

Photo: Pexels

తగినంత నిద్రించడం వల్ల కూడా బరువు పెరిగేందుకు తోడ్పడుతుంది. సరైన నిద్ర వల్ల జీవక్రియ మెరుగై బరువు సరిగా ఉండేలా సహకరిస్తుంది.

Photo: Pexels

బరువు పెరగాలంటే రోజులో ఎక్కువసార్లు తింటే మేలు. 3సార్లు అధికంగా తినడం కంటే.. తక్కువ మొత్తంలో ఎక్కువసార్లు ఆహారం తీసుకుంటే బాగుంటుంది. దీనివల్ల మీకు ఆకలి పెరిగి.. బరువు ఎక్కువయ్యేందుకు తోడ్పడుతుంది. 

Photo: Pexels

మెదడు పనితీరును మెరుగుపరిచి జ్ఞాపకశక్తిని పెంచేందుకు ఈ 9 ఆహారాలు ఎంతో ఉపయోగపడతాయి. వయస్సు సంబంధిత జ్ఞాపకశక్తి క్షీణత తగ్గించుకునేందుకు ఈ ఆహారాలు మీ రోజు వారీ ఆహారంలో చేర్చుకోండి.  

pexels