భారతీయ గూస్బెర్రీ అని పిలిచే ఉసిరిని దశాబ్దాలుగా సంప్రదాయ వైద్యంలో వినియోగిస్తున్నారు. ఉసిరి కాయ, గింజలతో పాటు ప్రతి భాగం ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంటుంది. ఉసిరి గింజల వల్ల ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకుందాం.  

pexels

By Bandaru Satyaprasad
Sep 03, 2024

Hindustan Times
Telugu

ఉసిరి యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలతో రిచ్ న్యూట్రిషన్ ప్రొఫైల్ కలిగి ఉంటుంది. ఉసిరిలో 80 శాతం నీరు ఉంటుంది. ఇందులో ప్రొటీన్లు, కార్బోహైడ్రేట్లు, ఫైబర్, మినరల్స్, గల్లిక్ యాసిడ్ అనే పాలీఫెనాల్ ఉన్నాయి. ఉసిరి విటమిన్ సికి గొప్ప మూలం.  

pexels

ఉసిరి కాయలో మాదిరిగానే గింజల్లో విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచుతాయి. రోజూ ఉసిరి తింటే జలుబు, ఇతర వైరల్ ఇన్‌ఫెక్షన్ల లక్షణాలను దూరం చేసుకోవచ్చు. ఉసిరి గింజలలోని ఐరన్ కంటెంట్ హిమోగ్లోబిన్ స్థాయిలను పెంచుతుంది.   

twitter

ఉసిరి గింజలు గుండె ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తాయి. వీటిల్లోని పోషకాలు చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించి మంచి కొలెస్ట్రాల్ ను ప్రోత్సహిస్తాయి.   

twitter

ఉసిరి గింజలలో అధిక ఫైబర్ కంటెంట్ ఉంటుంది. ఇది మలబద్ధకాన్ని నివారించి జీర్ణక్రియలో సహాయపడుతుంది. ఉసిరి విత్తనాలు పేగుల్లో ఆహార కదలికలకు తోడ్పడతాయి. ఇవి జీర్ణ సమస్యలను తగ్గిస్తాయి.   

pexels

ఉసిరి గింజలలోని యాంటీఆక్సిడెంట్లు చర్మంలోని ఫ్రీ రాడికల్స్‌తో పోరాడి వృద్ధాప్య లక్షణాలను తగ్గిస్తాయి.  ఉసిరి గింజలను తినడం వల్ల చర్మం ఆరోగ్యం మెరుగుపరుచుకోవచ్చు. 

twitter

ఉసిరి గింజలు జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తాయి. తెల్ల జుట్టును అరికట్టడానికి అవసరమైన పోషకాలకు ఉసిరి పవర్ హౌస్. హెయిర్ ఫోలికల్స్‌ను బలోపేతం చేయడం, జుట్టుకు మెరుపును జోడించడంలో సహాయపడతాయి. ఉసిరి నూనెను అప్లై చేస్తే జుట్టు ఒత్తుగా, ఆరోగ్యంగా ఉంటుంది. 

twitter

ఉసిరి గింజల పోషక విలువలు- ఒక టీ స్పూన్(2 గ్రా) ఉసిరి గింజలు సుమారు 5-6 కేలరీలను అందిస్తాయి. ఇందులో 0.3 గ్రా డైటరీ ఫైబర్, 0.1 గ్రా చక్కెరతో సహా 1.2 గ్రాముల కార్బోహైడ్రేట్లు, 0.1 గ్రా ప్రోటీన్, 0.03 గ్రా ఫ్యాట్ ఉంటుంది. ఉసిరి గింజల్లో విటమిన్ సి అధికంగా ఉంటుంది.  

twitter

ప్లేట్లెట్ల సంఖ్య అధికమయ్యేందుకు ఈ 5 రకాల పండ్లు తినండి!

Photo: Pexels