ఆలివ్ నూనె వాడితే ఏమవుతుంది..! ఈ విషయాలను తెలుసుకోండి
By Maheshwaram Mahendra Chary Jul 10, 2024
Hindustan Times Telugu
ఆలివ్ నూనె అత్యధిక స్థాయిలో ప్రయోజనకరమైన సమ్మేళనాలను కలిగి ఉంటుంది. వంటకోసం ఆలివ్ నూనెను ఉపయోగించడం వలన ఎన్నో ఆరోగ్య లాభాలు ఉంటాయి.
image credit to unsplash
ఆలివ్ ఆయిల్‌లో మోనోఅన్‌శాచురేటెడ్ కొవ్వులు పుష్కలంగా ఉంటాయి. ప్రత్యేకంగా ఒలీక్ యాసిడ్ ఉంటుంది. ఇది గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
image credit to unsplash
ఆలివ్ నూనెలో విటమిన్ E, ఫినోలిక్ సమ్మేళనాల వంటి శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి, ఇవి ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టం నుండి కణాలను రక్షించడంలో సహాయపడతాయి.
image credit to unsplash
ఆలివ్ ఆయిల్ తో జీర్ణవ్యవస్థ మరింతగా మెరుగుపడుతుంది. పోషకాలను బాగా గ్రహించడాన్ని ప్రోత్సహిస్తుంది.
image credit to unsplash
ఆలివ్ నూనెను క్రమం తప్పకుండా తీసుకోవడం మెదడు పనితీరు మెరుగుపడుతుందని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. అల్జీమర్స్, పార్కిన్సన్స్ వంటి న్యూరోడెజెనరేటివ్ వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుందని సూచిస్తున్నాయి.
image credit to unsplash
ఆలివ్ నూనెను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల శరీరంలో దీర్ఘకాలిక మంట, నొప్పులు కలిగించే వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది.
image credit to unsplash
వంటలకు ఆలివ్ ఆయిల్ వినియోగించడం వల్ల స్ట్రోక్ రిస్క్ తగ్గుతుందని అధ్యయనాలు సూచిస్తున్నాయి. ఆలివ్ ఆయిల్ లోని యాంటీ ఇన్ల్ఫమేటరీ, యాంటీఆక్సిడెంట్ గుణాలు మీ శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు పెరగకుండా చూస్తాయి. రక్తపోటును అదుపులో ఉంచుతాయి.
image credit to unsplash
కిడ్నీలో రాళ్లు ఉంటే విపరీతమైన నొప్పి వస్తుంది. కిడ్నీలో రాళ్లు ఏర్పడకుండా నివారించేందుకు మాంస పదార్థాలు, సోడా, డ్రైఫ్రూట్స్ వంటి ట్రిగ్గర్లకు దూరంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు.