పచ్చి కొబ్బరిని ఆహారంగా తీసుకుంటాం. అయితే కొబ్బరి పాలతోనూ చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.
Unsplash
By Anand Sai Nov 13, 2023
Hindustan Times Telugu
పచ్చి కొబ్బరి నుంచి వచ్చే కొబ్బరి పాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అందానికి కూడా చాలా ఉపయోగపడతాయి.
Unsplash
కొబ్బరి పాలల్లో క్యాల్షియం, ఫాస్పరస్, ఐరన్ వంటి పోషకాలు ఉంటాయి. ఇవి తీసుకుంటే ఎముకలు బలంగా తయారవుతాయి.
Unsplash
కొబ్బరి పాలను తీసుకోవడం కారణంగా రక్తహీనత తగ్గుతుంది. రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి.
Unsplash
ఈ పాలతో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఇన్ఫెక్షన్స్ మన దరికి చేరకుండా ఉంటాయి.
Unsplash
బరువు తగ్గడంలోనూ కొబ్బరి పాలు ప్రత్యేకంగా ఉపయోగపడతాయి. శరీర ఆరోగ్యంతోపాటుగా చర్మ అందానికి ఇవి చాలా మంచిది.
Unsplash
స్నానం చేసే నీటిలో రోజ్ వాటర్, కొబ్బరి పాలు కలిపి స్నానం చేయాలి. ఇలా చేస్తే.. పాడైన చర్మం కూడా తిరిగి నిగారింపును సొంతం చేసుకుంటంది. నేరుగా చర్మం మీద కూడా రాసుకోవచ్చు.
Unsplash
జుట్టు రాలే సమస్యతో బాధపడే వారు కూడా కొబ్బరి పాలను ఉపయోగించడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. వారానికి రెండుసార్లు ఉపయోగిస్తే అద్భుతమైన ఫలితాలు ఉంటాయి.
Unsplash
గుండెకు మేలు చేసే పొటాషియం పుష్కలంగా ఉండే ఫుడ్స్ ఇవి