గులాబీ టీ తాగితే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు - ఈ విషయాలు తెలుసుకోండి

image credit to unsplash

By Maheshwaram Mahendra Chary
May 23, 2024

Hindustan Times
Telugu

గులాబీ పూలను శతాబ్దాలుగా హెర్బల్ మెడిసిన్‌లో ఉపయోగిస్తూ వస్తున్నారు. గులాబీ రేకులను వివిధ ఆహార పదార్థాలలో కలుపుతారు. అవి రంగు ఫేవర్ మాత్రమే కాకుండా వివిధ ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి. 

image credit to unsplash

సాధారణ తేయాకు ఆకులతో పాటు కొన్ని ఎండిన గులాబీ రేకులను జోడించడం వల్ల ఆ టీకి మధురమైన పూల రుచి, వాసన వస్తుంది. రోజ్ టీ తాగటం వలన అనేక ప్రయోజనాలు ఉంటాయి.

image credit to unsplash

    ఒక కప్పు రోజ్ టీ ఒత్తిడి, ఆందోళనలను తగ్గించగలదు. గులాబీ రేకులు విశ్రాంతిని ప్రభావాలను కలిగించటమే కాదు ఒత్తిడి స్థాయిలను తగ్గిస్తాయి.

image credit to unsplash

  గులాబీ రేకులలో యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. యాంటీఆక్సిడెంట్లు హానికరమైన ఫ్రీ రాడికల్స్‌ను దూరం చేయడానికి సహాయపడుతాయి. క్యాన్సర్ వంటి వ్యాధులను నివారించడానికి కూడా ఇవి సహాయపడతాయి.

image credit to unsplash

    గులాబీ రేకుల్లో యాంటీమైక్రోబయల్ లక్షణాలు ఉంటాయి, ఇవి హానికరమైన బ్యాక్టీరియా నుండి మిమ్మల్ని రక్షించడంలో సహాయపడతాయి. ఒక కప్పు రోజ్ టీ మీ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది.

image credit to unsplash

    గులాబీ రేకుల్లో విటమిన్ సి ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచడం నుండి శరీరం ఇనుమును గ్రహించడంలో సహాయపడటం వరకు అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంది.

image credit to unsplash

    రోజ్ టీ తాగడం వల్ల మీ హైడ్రేషన్ మెరుగుపడుతుంది, ఇది మీ చర్మానికి ప్రయోజనకరమైన ప్రభావాలను కలిగి ఉంటుంది. వృద్ధాప్య సంకేతాలను దూరం చేయగలదు.

image credit to unsplash

గుండెకు మేలు చేసే పొటాషియం పుష్కలంగా ఉండే ఫుడ్స్ ఇవి

Photo: Pexels