అలోవెరా బర్న్ ప్లాంట్ అని కూడా పిలుస్తారు. ఇది చర్మంపై దద్దుర్లు సహా వివిధ సమస్యలను తగ్గిస్తుంది.  తీవ్రమైన దద్దుర్లు ఉన్న చోట్ల కలబంద రాస్తే మీకు రిలీఫ్ లభిస్తుంది.  స్కిన్ రాష్‌కి అలోవెరా బెస్ట్ హోం రెమెడీ.   

twitter

By Bandaru Satyaprasad
Aug 26, 2024

Hindustan Times
Telugu

అలోవెరా జెల్ - కలబంద జెల్‌ను చర్మం దురద, దద్దుర్లు ఉన్న చోట నేరుగా అప్లై చేయండి. ఇలా చేస్తే దద్దుర్లు నుంచి ఉపశమనం లభిస్తుంది. చర్మం ఎరుపు, వాపు తగ్గుతుంది.   

pexels

అలోవెరా జెల్, బాదం నూనె - అలోవెరా జెల్, బాదం నూనె కలిపి చర్మంపై సున్నితంగా అప్లై చేయండి. 10-15 నిమిషాలు అలాగే ఉంచండి. తర్వాత గోరువెచ్చని నీటితో కడగాలి. ఈ రెమెడీ చర్మంపై దద్దుర్ల నుంచి తక్షణ ఉపశమనాన్ని అందిస్తుంది. 

twitter

అలోవెరా, తేనె - అలోవెరా జెల్, తేనె మిశ్రమాన్ని చర్మంపై అప్లై చేయండి. 10-15 నిమిషాలు అలాగే ఉంచండి. తర్వాత గోరువెచ్చని నీటితో కడగాలి. ఇది చర్మంపై ఇన్ఫెక్షన్‌ను నివారించడంలో సహాయపడతాయి.   

pexels

అలోవెరా జెల్, విటమిన్ ఇ- అలోవెరా జెల్, విటమిన్ ఇ ఆయిల్ మిశ్రమాన్ని చర్మం దద్దుర్లు ఉన్న చోట సున్నితంగా అప్లై చేసి కాసేపు మసాజ్ చేయండి. విటమిన్ ఇలో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు దురద, చర్మ సమస్యలను తగ్గిస్తాయి.   

pexels

కలబంద, కొబ్బరి నూనె -అలోవెరా, కొబ్బరి నూనెను కలిపి చర్మంపై సున్నితంగా మసాజ్ చేయండి. కొబ్బరి నూనెలో మాయిశ్చరైజింగ్ గుణాలు ఉంటాయి. ఇవి చర్మాన్ని హైడ్రేట్ చేస్తాయి. కలబంద చర్మవాపు నుంచి ఉపశమనాన్ని అందిస్తుంది. 

twitter

కలబంద, రోజ్ వాటర్ - అలోవెరా జెల్ కు 2-3 డ్రాప్స్ రోజ్ వాటర్ కలిపి చర్మంపై సున్నితంగా అప్లై చేయండి. 10-15 నిమిషాలు అలాగే ఉంచండి. తర్వాత గోరువెచ్చని నీటితో కడగాలి. ఇది సన్ బర్న్ వల్ల ఏర్పడే దద్దుర్లు నుంచి తక్షణ ఉపశమనం కలిగిస్తుంది.  

twitter

కలబంద, ఓట్మీల్ - అలోవెరా జెల్ కు ఓట్మీల్ కలిపి పేస్ట్ లా తయారు చేయండి. దీన్ని చర్మంపై అప్లై చేయండి. 15-20 నిమిషాలు అలాగే ఉంచండి. ఓట్మీల్ దురద, చికాకు నుంచి ఉపశమనం కలిగిస్తుంది.   

twitter

మిల్లెట్స్‌ తింటే ఏమవుతుంది...? వీటిని తెలుసుకోండి

image credit to unsplash