కోడిగుడ్ల గురించి ఈ అపోహలు వద్దు: నిజాలు తెలుసుకోండి
Photo: Pexels
By Chatakonda Krishna Prakash Dec 16, 2023
Hindustan Times Telugu
కోడిగుడ్లు తింటే ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు దక్కుతాయి. చాలా పోషకాలు అందుతాయి. అయితే, కొందరిలో గుడ్ల విషయంలో కొన్ని అపోహలు ఉన్నాయి. వాటి గురించిన నిజాలు ఏవో ఇక్కడ తెలుసుకోండి.
Photo: Pexels
తెల్ల గుడ్ల కంటే గోధుమ రంగులో ఉండే గుడ్లు ఆరోగ్యకరమైనవని కొందరు అనుకుంటుంటారు. కానీ అది నిజం కాదు. రెండు రకాల గుడ్లలో సమానమైన పోషకాలు ఉంటాయి.
Photo: Pexels
గుడ్డు సొన తింటే బరువు ఎక్కువగా పెరుగుతారని కొందరి అపోహ. అయితే, ఎగ్ వైట్ కంటే సొనలోనే ఎక్కువ క్యాలరీలు ఉంటాయి. విటమిన్ ఏ, డీ, ఒమెగా3 ఫ్యాటీ యాసిడ్స్ సహా చాలా పోషకాలు సోనలో ఉంటాయి. ఇవి తింటే కడుపు నిండిన ఫీలింగ్ ఎక్కువగా ఉంటుంది. ఆకలిని తగ్గిస్తుంది.
Photo: Pexels
గుడ్లు ప్రతీ రోజు తినకూడదని కూడా కొందరు అంటుంటారు. అయితే, ఈ వాదనలో అర్ధం లేదు. హై క్వాలిటీ ప్రొటీన్లు, అవసరమైన విటమిన్లు, మినరల్స్ గుడ్లలో ఉంటాయి. అందుకే ప్రతీ రోజు గుడ్లు తొనొచ్చు.
Photo: Pexels
కోడిగుడ్లను ఉడకబెట్టే ముందు తప్పక కడగాలని అలా అయితే సాల్మోనెల్లా పోతుందని కొందరు నమ్ముతుంటారు. అది వాస్తవం కాదు. గుడ్లను కడగాల్సిన అవసరం లేదు. ఒకవేళ కడిగితే గుడ్ల పొట్టుపై ఉండే నేచురల్ ప్రొటెక్టివ్ కోటింగ్ పోతుంది.
Photo: Pexels
వేసవి కాలంలో కోడిగుడ్లను తినకూడదని కొందరిలో అపోహ ఉంటుంది. అయితే, గుడ్లు చాలా పోషకాలతో కూడిన ఆహారం కాబట్టి ఏ కాలంలోనైనా తినొచ్చని చాలా అధ్యయనాలు వెల్లడించాయి. అందుకే వేసవితో పాటు అన్ని కాలాల్లోనూ గుడ్లను తినొచ్చు.
Photo: Pexels
గుడ్లు తింటే శరీరంలో కొవ్వు (కొలెస్ట్రాల్) స్థాయి ఎక్కుగా పెరుగుతుందని కొందరు అనుకుంటుంటారు. అయితే, బ్లడ్ కొలెస్ట్రాల్ లెవెళ్లపై గుడ్ల ప్రభావం చాలా తక్కువని చాలా అధ్యయనాలు తేల్చాయి.
Photo: Pexels
గుండెకు మేలు చేసే పొటాషియం పుష్కలంగా ఉండే ఫుడ్స్ ఇవి