డయాబెటిస్ ఉన్న వారి కోసం షుగర్ తక్కువగా ఉండే 6 పండ్లు
Photo: Pexels
By Chatakonda Krishna Prakash Apr 17, 2024
Hindustan Times Telugu
డయాబెటిస్ ఉన్న వారు షుగర్ కంటెంట్ ఎక్కువగా ఉన్న పండ్లు తినడం మేలు. దీనివల్ల షుగర్ నియంత్రణ మెరుగ్గా ఉంటుంది. అలా.. షుగర్ తక్కువగా ఉండే 6 రకాల పండ్లు ఏవంటే..
Photo: Pexels
స్ట్రాబెర్రీలు, బ్లూబెర్రీలు తీపిగా అనిపించినా.. వీటిలో షుగర్ చాలా తక్కువగా ఉంటుంది. అందుకే వీటిని ప్రతీ రోజూ తినొచ్చు. ఈ పండ్లలో విటమిన్ సీ సహా చాలా పోషకాలు ఉంటాయి.
Photo: Pexels
జామపండ్లలో షుగర్ స్వల్పంగా ఉంటుంది. ఫైబర్, విటమిన్స్, మినరల్స్ మెండుగా ఉంటాయి. దీంతో డయాబెటిస్ ఉన్న వారు ఈ పండును తినొచ్చు.
Photo: Pexels
వేసవిలో లభించే పుచ్చకాయలు రుచికరంగా ఉండడమే కాక.. వీటిలో షుగర్ స్వల్పంగానే ఉంటుంది. శరీరానికి అవసరమైన ఎలక్ట్రోలైట్స్, విటమిన్ ఏ, సీలను కూడా పుచ్చకాయ అందిస్తుంది.
Photo: Pexels
నిమ్మ, నారింజ పండ్లలోనూ ఉండే షుగర్ తక్కువే. దీంతో డయాబెటిస్ ఉన్న వారు వీటిని తీసుకోవచ్చు. విటమిన్ సహా చాలా పోషకాలు వీటిలో ఉంటాయి.
Photo: Pexels
కివీ పండ్లలోనూ షుగర్ చాలా స్వల్పంగా ఉంటుంది. విటమిన్ సీ సహా మరిన్ని పోషకాలు ఈ పండ్లలో ఉంటాయి.
Photo: Pexels
బొప్పాయి పండులోనూ షుగర్ అత్యల్పమే. ఈ పండు తినడం వల్ల విటమిన్ ఏ,సీ,ఈతో పాటు శరీరానికి ఫైబర్ కూడా లభిస్తుంది.