అధిక బ్లడ్ ప్రెజర్ (బీపీ)తో ఈకాలంలో ఎక్కువ మంది ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. బీపీ ఎక్కువైతే ఆరోగ్య ఇతర ఆరోగ్య సమస్యలు కూడా తలెత్తుతాయి. మందులు వాడడంతో పాటు బీపీ తక్కువగా, నియంత్రణలో ఉండేలా చూసుకోవాలంటే చేయాల్సిన పనులను ఇక్కడ తెలుసుకోండి.
Photo: Pexels
శరీర బరువును నియంత్రణలో ఉంచుకోవడం చాలా ముఖ్యం. ఉండాల్సిన దాని కంటే ఎక్కువగా బరువు ఉండే బ్లడ్ ప్రెజర్ సమస్య కూడా అధికమయ్యే అవకాశం ఉంటుంది. అందుకే అధిక బరువు ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.
Photo: Pexels
ప్రతీ రోజూ వ్యాయామం, వాకింగ్ చేయడం.. బ్లడ్ ప్రజెర్ నియంత్రణలో ఉండేందుకు సహకరిస్తుంది. బరువు తగ్గేందుకు ఎక్సర్‌సైజ్‍లు ఉపయోగపడతాయి.
Photo: Pexels
ఆహారంలో ఉప్పు ఎక్కువగా తింటే బ్లడ్ ప్రెజర్ వేగంగా పెరుగుతుంది. అందుకే ఉప్పు కాస్త తక్కువగా తినడమే మంచిది.
Photo: Pexels
కార్బొహైడ్రేట్లు, చెక్కర ఎక్కువగా ఉండే ఆహారాలు తింటే బ్లడ్ ప్రెజర్ పెరిగే అవకాశాలు ఉంటాయి. అందుకే వీటిని పరిమితి మేరకే తీసుకోవాలి. ఎక్కువగా తినకూడదు.
Photo: Pexels
బీపీ తగ్గేందుకు పొటాషియం పుష్కలంగా ఉండే ఆహారాలు తినండి. వీటి వల్ల బీపీ నియంత్రణలో ఉండటంతో పాటు కొలెస్ట్రాల్ కూడా తగ్గే అవకాశాలు ఉంటాయి. గుండె సమస్యల రిస్క్ కూడా తగ్గుతుంది.
Photo: Pexels
బీపీ తగ్గాలంటే ధూమపానం, మద్యపానం అసలు చేయకూడదు. ఈ అలవాట్లు ఉంటే మానుకోవాలి. అలాగే, ఫాస్ట్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్ కూడా తినకపోవడమే మంచిది.
Photo: Pexels
గుండెకు మేలు చేసే పొటాషియం పుష్కలంగా ఉండే ఫుడ్స్ ఇవి