బరువు తగ్గాలనుకుంటున్నారా? ఫైబర్ ఎక్కువగా ఈ ఫుడ్స్ తింటే మేలు

Photo: Pexels

By Chatakonda Krishna Prakash
Nov 11, 2023

Hindustan Times
Telugu

బరువు తగ్గాలనుకునే వారు ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహారాలు తీసుకోవాలి. దీని వల్ల కడుపు ఆరోగ్యం మెరుగుపడుతుంది. కడుపు చుట్టూ ఉండే కొవ్వు తగ్గేందుకు ఫైబర్ ఉపయోగపడుతుంది. వెయిట్ లాస్‍కు తోడ్పడుతుంది. ఫైబర్ పుష్కలంగా ఉండే కొన్ని ఫుడ్స్ ఇవే.

Photo: Pexels

అవకాడోలో ఫైబర్, ఆరోగ్యకరమైన ఫ్యాట్ అధికంగా ఉంటాయి. ఇవి తింటే కడుపు నిండిన ఫీలింగ్ ఎక్కువసేపు ఉంటుంది. దీంతో బరువు తగ్గేందుకు అవకాడో తోడ్పడుతుంది. మరిన్ని పోషకాలు కూడా అవకాడోలో ఉంటాయి. 

Photo: Pexels

చిలకడదుంపల్లో క్యాలరీలు తక్కువగా పైబర్ పుష్కలంగా ఉంటుంది. దీంతో వెయిల్ లాస్ కావాలనుకుంటున్న వారు దీన్ని డైట్‍లో తీసుకుంటే చాలా మేలు. 

Photo: Pexels

బ్రకోలీలోనూ ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. విటమిన్ కే, ఫోలేట్, పొటాషియమ్, మెగ్నిషియమ్, యాంటీయాక్సిడెంట్లు కూడా బ్రకోలీలో ఉంటాయి. దీంతో ఇది తీసుకుంటే మీరు బరువు తగ్గేందుకు సహకరిస్తుంది. 

Photo: Pexels

వెయిట్ లాస్ కావాలనుకునే వారికి ఓట్స్ కూడా ఆరోగ్యకమైన ఆహారంగా ఉంటుంది. ఫైబర్‌తో పాటు విటమిన్స్, మినరల్స్ కూడా వీటి ద్వారా లభిస్తాయి.  

Photo: Pexels

శెనగ, పెసలు, మినుములు లాంటి పప్పులు, కాయధాన్యాల్లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇవి మీ ఆహారంలో తీసుకున్నా బరువు తగ్గేందుకు తోడ్పడతాయి. 

Photo: Pexels

జామకాయల్లోనూ ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. విటమిన్ ఏ, విటమిన్ సీ, మెగ్నిషియమ్, కాల్షియమ్ సహా మరిన్ని పోషకాలు ఉంటాయి. వెయిట్ లాస్‍కు జామ కూడా చాలా తోడ్పడుతుంది. 

Photo: Pexels

చలికాలంలో ఈ జ్యూస్‍తో మెండుగా రోగ నిరోధక శక్తి.. రోజూ తాగండి!

Photo: Pexels