చలికాలంలో తప్పక తినాల్సిన విటమిన్-డీ ఫుడ్స్ ఇవి

Photo: Pexel

By Chatakonda Krishna Prakash
Nov 06, 2023

Hindustan Times
Telugu

శరీరానికి విటమిన్ డీ చాలా అవసరం. అయితే, చలికాలంలో సూర్యరశ్మి అంతగా ఉండదు. దీంతో విటమిన్-డీ కావాల్సినంత అందకపోవచ్చు. అందుకే  విటమిన్-డీ పుష్కలంగా ఉండే ఆహారాలను శీతాకాలంలో తప్పక తినాలి. అలాంటి 5 ఫుడ్స్ ఇవే. 

Photo: Pexels

పుట్టగొడుగుల్లో (మష్రూమ్స్) విటమిన్-డీ పుష్కలంగా ఉంటుంది. అలాగే ఫైబర్, ప్రొటీన్, పొటాషియమ్, సెలెనియమ్ కూడా ఉంటాయి. దీంతో ఇవి తింటే శరీరానికి పోషకాలు అందుతాయి. ఇన్ఫెక్షన్ల నుంచి పోరాడేందుకు తోడ్పడుతుంది. 

Photo: Pexels

కోడిగుడ్డు పచ్చసొనలోనూ విటమిన్ డీ ఎక్కువగా ఉంటుంది. అలాగే గుడ్లు తింటే ఐరన్, కాల్షియమ్, పొటాషియమ్, సెలెనియమ్, అయోడిన్ పోషకాలు కూడా శరీరానికి అందుతాయి. 

Photo: Pexels

సాల్మోన్, సర్డినైన్, టునా లాంటి ఫ్యాటీ చేపల్లోనూ విటమిన్ డీ అధికంగా ఉంటుంది. ఇవి తిన్నా మీకు విటమిన్-డీ పుష్కలంగా అందుతుంది.

Photo: Pexels

పాలు, టోఫు, సోయా మిల్క్, సోయా యగర్ట్ లాంటి ఫుడ్స్‌లోనూ విటమిన్ డీ పుష్కలంగా ఉంటుంది.

Photo: Pexels

కాడ్ లివర్ ఆయిల్‍లో విటమిన్ డీతో పాటు విటమిన్ ఏ, ఒమెగా-3 కూడా ఎక్కువగా ఉంటాయి. దీని వల్ల ఇది తీసుకుంటే ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు చేకూరుతాయి. 

Photo: Unsplash

ఇటీవ‌లే ఫ్యామిలీస్టార్‌తో తెలుగు ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించాడు విజ‌య్ దేవ‌ర‌కొండ‌. 

twitter