బరువు తగ్గాలనుకుంటే డైట్‍లో ఈ వెజిటేరియన్ ఫుడ్స్ తీసుకోండి!
Photo: Pexels
By Chatakonda Krishna Prakash Sep 14, 2024
Hindustan Times Telugu
బరువు తగ్గాలనుకుంటే తీసుకునే ఆహారం చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. వెయిట్ లాస్‍కు కొన్ని ఆహారాలు బాగా తోడ్పడతాయి. అలా.. బరువు తగ్గేందుకు ఉపయోగపడే ఐదు రకాల వెజిటేరియన్ ఫుడ్స్ ఏవో ఇక్కడ చూడండి.
Photo: Pexels
బ్రౌన్ రైస్‍లో డెయెటరీ ఫైబర్స్ పుష్కలంగా ఉంటాయి. ఎక్కువగా ఆకలై క్యాలరీలు అధికంగా తీసుకుండా ఈ రైస్ సహకరిస్తుంది. బరువు తగ్గేందుకు బ్రౌన్ రైస్‍ను మీ డైట్‍లో యాడ్ చేసుకోవడం మేలు చేస్తుంది.
Photo: Pexels
చియా, గుమ్మడి, నువ్వులు లాంటి విత్తనాల్లో ఒమెగా-3 ఫ్యాటీ యాసిడ్స్, మినరల్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి రెగ్యులర్‌గా డైట్‍లో తీసుకుంటే బరువు తగ్గేందుకు ఉపకరిస్తాయి.
Photo: Pexels
పప్పు ధాన్యాల్లో ప్రొటీన్లు, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి తీసుకుంటే ఆకలిని నియంత్రిస్తాయి. బరువు తగ్గేందుకు మేలు చేస్తాయి.
Photo: Pexels
క్యాలరీలు తక్కువగా ఉండే నారింజ, యాపిల్, ప్లమ్ లాంటి పండ్లను డైలీ తినాలి. వీటిలోని విటమిన్లు, ఫ్లేవనోయిడ్స్ జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. వెయిట్ లాస్‍కు ఉపయోగపడతాయి.
Photo: Pexels
బాదం, జీడిపప్పు, ఆక్రోటు లాంటి నట్స్‌లో కాల్షియం, విటమిన్స్, ఫ్లేవనాయిడ్స్ మెండుగా ఉంటాయి. జీవక్రియను మెరుగుపరచడం, ఆకలిని తగ్గించడం ద్వారా బరువు తగ్గేందుకు నట్స్ తోడ్పడతాయి.
Photo: Pexels
చలికాలంలో ఈ జ్యూస్‍తో మెండుగా రోగ నిరోధక శక్తి.. రోజూ తాగండి!