హై బ్లడ్ ప్రజర్ (బీపీ) సమస్య ఉన్న వారు మందులు వియోగించటంతో పాటు ఆహార జాగ్రత్తలు పాటించడం కూడా ముఖ్యం. కొన్ని రకాల ఆహారాలు బీపీని కంట్రోల్ చేయటంలో సహకరిస్తాయి. అలా.. బీపీ నియంత్రణలో ఉండేందుకు తోడ్పడే ఐదు రకాల వెజిటేరియన్ ఆహారాలు ఏవో ఇక్కడ చూడండి.
Photo: Pexels
పాలకూర, బచ్చలి, కేల్ లాంటి ఆకుకూరల్లో పొటాషియం, నైట్రేట్స్ ఎక్కువగా ఉంటాయి. బీపీ నియంత్రణలో ఉండేందుకు ఇవి తోడ్పడతాయి.
Photo: Pexels
శనగలు, బీన్స్, సోయాబీన్స్ లాంటి కాయధాన్యాలను తినాలి. వీటిలోనూ మెగ్నిషియం, పొటాషియం పుష్కలంగా ఉంటాయి. దీంతో ఇవి తింటే బీపీని తగ్గించగలవు.
Photo: Pexels
అరటి పండులోనూ పొటాషియం పుష్కలంగా ఉంటుంది. శరీరంలోని సోడియం స్థాయిలను ఇది నియంత్రిస్తుంది. బీపీ కంట్రోల్‍లో ఉండేందుకు తోడ్పడుతుంది.
Photo: Pexels
నారింజ, చీని లాంటి సిట్రస్ పండ్లు, బెర్రీ పండ్లలో విటమిన్ సీతో పాటు యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. బీపీ కంట్రోల్‍లో ఉండేలా ఇవి సహకరిస్తాయి.
Photo: Pexels
బాదం, ఆక్రోటు, గుమ్మడి విత్తనాలు, అవిసె గింజలు లాంటి నట్స్, గింజలు కూడా బీపీని నియంత్రిస్తాయి. వీటిలో ఫైబర్, అర్జినైన్ పుష్కలంగా ఉంటాయి.
Photo: Pexels
మనం వాడే వంట నూనెల్లో చాలా రకాలు ఉంటాయి. వాటి ఉపయోగాలు వేర్వేరుగా ఉంటాయి. ప్రతి నూనెలో మంచిచెడులు ఉంటాయి. వంట నూనెల వినియోగంలో రెండు, మూడు రకాలను కలిపి వినియోగించడం మేలు