అతిగా కాఫీ తాగితే కలిగే 5 సైడ్ ఎఫెక్ట్స్ ఇవే

Photo: Pexels

By Chatakonda Krishna Prakash
Nov 07, 2023

Hindustan Times
Telugu

కాఫీ అంటే చాలా మందికి ఎంతో ఇష్టం. ఇది తాగడం వల్ల కొన్ని ప్రయోజనాలు కూడా ఉంటాయి. అయితే, కాఫీని మోతాదుకు మించి అతిగా తాగితే కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి. కాఫీ ఎక్కువగా తాగితే కలిగే ముఖ్యమైన దుష్ప్రభావాలు ఏవో ఇక్కడ చూడండి. 

Photo: Pexels

కాఫీ అతిగా తాగితే జీర్ణక్రియకు ఇబ్బంది అవుతుంది. ఆహారం త్వరగా జీర్ణం కాదు. కఫీన్ ఎక్కువ మోతాదు అయితే.. కొందరికి విరేచనాలు కూడా అవుతాయి. 

Photo: Pexels

కాఫీ అతిగా తాగడం వల్ల నిద్ర సరిగా పట్టకపోయే అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా రాత్రి వేళల్లో కాఫీ ఎక్కువగా తాగితే నిద్రలేమి సమస్య వస్తుంది. ఎక్కువ కాలం అతిగా కాఫీ తాగితే ఇన్‍సోమియా వచ్చే ఛాన్స్ ఉంటుంది. 

Photo: Pexels

కాఫీ తాగితే శరీరంలో ఆడ్రెనలైన్ హార్మోన్ ఉత్పత్తి ఎక్కువ అవుతుంది. ఒకవేళ కాఫీని అతిగా తాగితే ఈ హార్మోన్ అధికమవుతుంది. దీని ద్వారా మానసిక ఆందోళన, కంగారు పెరుగుతాయి. 

Photo: Pexels

కాఫీ ఎక్కువగా తాగితే బ్లడ్ ప్రెజర్ ఎక్కువయ్యే అవకాశాలు ఉంటాయి. అందుకే పరిమితి మేరకే కాఫీ తాగాలి. 

Photo: Pexels

కాఫీ తాగితే కాసేపు ఎనర్జీ బాగున్నట్టు అనిపిస్తుంది. అయితే, కాఫీ అతిగా తాగితే కాసేపటి తర్వాత అలసటగా అనిపించే అవకాశం ఉంటుంది. కొందరిలో ఆయాసంగానూ అనిపిస్తుంది. 

Photo: Pexels

లక్ష్మీదేవికి  ఈ పూలతో పూజ చేస్తే మీ ఇంట సిరుల పంట 

pinterest