వర్కౌట్స్ చేసేటప్పుడు తప్పక పాటించాల్సిన 5 సెఫ్టీ టిప్స్ ఇవి

Photo: Unsplash

By Chatakonda Krishna Prakash
Oct 01, 2023

Hindustan Times
Telugu

జిమ్‍లో వర్కౌట్స్ (వ్యాయామాలు) చేయడం ఆరోగ్యానికి, ఫిట్‍నెస్‍కు చాలా ముఖ్యం. అయితే, వర్కౌట్స్ చేసే సమయంలోనూ కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి. వాటిలో ముఖ్యమైన 5 ఇవే.

Photo: Unsplash

వర్కౌట్ చేసే ముందు తప్పనిసరిగా వామప్ ఎక్సర్‌సైజ్‍లు చేయాలి. చిన్న వ్యాయామాల ద్వారా మీ బాడీని జిమ్‍కు సిద్ధం చేసుకునేందుకు ఇది ఉపయోగపడుతుంది. వర్కౌట్స్ చేసే సమయంలో గాయపడే ప్రమాదం తగ్గుతుంది. 

Photo: Unsplash

వర్కౌట్స్ చేసే సమయంలో శరీరం డీహైట్రేట్ కాకుండా జాగ్రత్త పడాలి. తరచూ నీరు తాగుతుండాలి. సరైన హైడ్రేషన్ మెయింటెన్ చేస్తే జిమ్‍లో పర్ఫార్మెన్స్ మెరుగ్గా ఉంటుంది. 

Photo: Unsplash

జిమ్‍లో ఎక్కువ బరువులు ఎత్తాలనుకుంటే సరైన స్థలాన్ని ఎంపిక చేసుకోవాలి. అలాగే సామర్థ్యాన్ని గుర్తించి ఆ మేరకే బరువులు ఎత్తాలి. 

Photo: Unsplash

వర్కౌట్స్ చేసేటప్పుడు ఓ పద్ధతిని, శరీరాకృతిని మెయింటెన్ చేయడం చాలా ముఖ్యం. ఇలా చేస్తే వర్కౌట్స్ ప్రభావం మెరుగ్గా ఉంటుంది. గాయాలు అయ్యే రిస్క్ తగ్గుతుంది. 

Photo: Unsplash

ఒకవేళ మీ కండరాలు చాలా అలసిపోయినట్టు అనిపిస్తే.. అప్పుడప్పుడు వర్కౌట్లకు రెస్ట్ డేస్ (విరామం) ఇవ్వాలి. శరీరం సహకరించని సమయాల్లో ఓవర్ ట్రైనింగ్ మంచిది కాదు. రికవర్ అయ్యాక మళ్లీ వర్కౌట్స్ చేయవచ్చు.

Photo: Unsplash

అల్లం, తులసి, బెల్లం మిశ్రమం చలికాలంలో పెరిగే జలుబు, దగ్గు, జ్వరం వంటి సమస్యల నుండి రక్షించడానికి ఒక బెస్ట్ హోం రెమెడీ.

Unsplash