పచ్చిమిర్చిలో ఈ ముఖ్యమైన పోషకాలు ఉంటాయని మీకు తెలుసా?
Photo: Pexels
By Chatakonda Krishna Prakash Aug 15, 2024
Hindustan Times Telugu
పచ్చి మిరపకాయలు (మిర్చి) వేసుకుంటే వంట కారంగా, రుచిగా ఉండటంతో పాటు పోషకాలు కూడా శరీరానికి అందుతాయి. పరిమితిమేర పచ్చిమిర్చి రోజూ తీసుకుంటే మంచిది. పచ్చిమిర్చిలో ఉండే ముఖ్యమైన పోషకాలు ఏవో, ఆరోగ్యానికి చేసే మేలు ఏంటో ఇక్కడ చూడండి.
Photo: Pexels
పచ్చిమిర్చిలో విటమిన్ సీ ఎక్కువగా ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తికి, చర్మ ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఎముకల దృఢత్వాన్ని కూడా మిర్చి మెరుగుపరచగలదు.
Photo: Pexels
పచ్చి మిరపకాయలో విటమిన్ బీ16 పుష్కలంగా ఉంటుంది. ఇది జుట్టు పెరుగుదలకు సహకరిస్తుంది. రోగనిరోధక వ్యవస్థకు కూడా మంచి చేస్తుంది.
Photo: Pexels
పచ్చిమిర్చిలో ఐరన్ కూడా ఉంటుంది. ఎర్రరక్త కణాల ఉత్పత్తికి ఇది తోడ్పడుతుంది. నీరసాన్ని కూడా ఇది తగ్గిస్తుంది. జ్ఞాపక శక్తికి కూడా మిర్చి సహకరిస్తుంది.
Photo: Pexels
పచ్చి మిరపకాయల్లో విటమిన్ కే కూడా ఉంటుంది. ఎముకల ఆరోగ్యానికి ఇది సహకరిస్తుంది. రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది.
Photo: Pexels
పచ్చిమిర్చిలో మ్యాగ్నిస్, కాపర్ కూడా ఉంటాయి. ఇవి కూడా ఓవరాల్ ఆరోగ్యానికి మంచి చేస్తాయి. అయితే, ఎన్ని పోషకాలు ఉన్నా.. పరిమితమేరనే పచ్చిమిర్చిని ఆహారంలో వేసుకోవాలి. మరీ అతిగా తీసుకోకూడదు.
Photo: Unsplash
చలికాలంలో ఈ జ్యూస్‍తో మెండుగా రోగ నిరోధక శక్తి.. రోజూ తాగండి!