పనస విత్తనాలు పడేస్తున్నారా? ఈ విషయాలు తెలుసుకోండి  

Photo: Unsplash

By Chatakonda Krishna Prakash
Sep 22, 2024

Hindustan Times
Telugu

పనస పండు తిని విత్తనాలను చాలా మంది పడేస్తుంటారు. అయితే, పనస విత్తనాల్లో విటమిన్-ఏ, ఫైబర్, ప్రోటీన్, సహా చాలా పోషకాలు ఉంటాయి. పనస విత్తనాలు తీసుకుంటే కలిగే ప్రయోజనాలు ఇవే. 

Photo: Pexels

పనస విత్తనాల్లో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. అందుకే కండరాలకు ఇవి మేలు చేస్తాయి. మెగ్నిషియం ఉండటం వల్ల ఎముకల ధృడత్వాన్ని మెరుగుపరుస్తాయి. 

Photo: Pexels

విటమిన్-సీ పుష్కలంగా ఉండటంతో పనస విత్తనాలను డైలీ తీసుకుంటే రోగ నిరోధక శక్తి మెరుగవుతుంది. 

Photo: Pexels

పనస విత్తనాల్లో ఫైబర్ కూడా ఎక్కువగా ఉంటుంది. దీంతో జీర్ణక్రియకు కూడా ఇవి మేలు చేస్తాయి. కడుపు సంబంధిత సమస్యలు తగ్గేందుకు తోడ్పడతాయి. 

Photo: Pexels

పనస విత్తనాల్లో ఐరన్ కూడా ఎక్కువగానే ఉంటుంది. దీంతో ఇవి రెగ్యులర్‌గా తీసుకుంటే శరీరంలో రక్తం పెరిగేందుకు కూడా సహాయపడుతుంది. 

Photo: Pexels

కొలెస్ట్రాల్ నియంత్రణలో ఉండేందుకు కూడా పనస విత్తనాలు సహాయపడతాయి. గుండె ఆరోగ్యానికి కూడా మేలు చేస్తాయి.

Photo: Pexels

పనస విత్తనాలను ఉడకపెట్టి పైన ఉన్న పొట్టు తీసి తినొచ్చు. లేకపోతే ఈ విత్తనాలను వేయించుకొని పొట్టు తీసి కూడా తినొచ్చు. 

Photo: Pexels

కాలేయం ఆరోగ్యంగా ఉండాలంటే ఈ ఆహారాలు కచ్చితంగా తినాలి..

pexels