హిమోగ్లోబిన్ కౌంట్ పెరిగేందుకు 5 ముఖ్యమైన టిప్స్ ఇవి

Photo: Unsplash

By Chatakonda Krishna Prakash
Jan 21, 2024

Hindustan Times
Telugu

ఎర్ర రక్తకణాల్లో ఉండే హిమోగ్లోబిన్ శాతం తగినంత ఉండాల్సిందే. శరీరంలో హిమో గ్లోబిన్ తక్కువైతే చాలా ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. అందుకే, హిమోగ్లోబిన్ కౌంట్‍ను పెంచుకునే ముఖ్యమైన ఐదు మార్గాలు ఇవే.

Photo: Unsplash

విటమిన్ సీ ఎక్కువగా నారింజ, టమోటాలు, ద్రాక్షలు, బెర్రీస్ లాంటి వాటిని తింటే శరీరంలో హిమోగ్లోబిన్ పెరుగుతుంది. 

Photo: Unsplash

ఐరన్ ఎక్కువగా ఉండే ఆహారాలు తినడం వల్ల హిమోగ్లోబిన్ శాతం పెరుగుతుంది. అందుకే, పాలకూర, బీట్‍రూట్, పప్పు ధాన్యాలు, కోడిగుడ్లు, చేపలు, డ్రైఫ్రూట్స్ లాంటివి తినాలి. 

Photo: Unsplash

దానిమ్మ పండు, దానిమ్మ రసం తాగితే శరీరంలో హిమో గ్లోబిన్ శాతం పెరిగేందుకు ఉపకరిస్తుంది. 

Photo: Unsplash

రెగ్యులర్‌గా వ్యాయామం చేయడం వల్ల కూడా శరీరంలో హిమోగ్లోబిన్ పెరిగేందుకు సహకరిస్తుంది. 

Photo: Unsplash

శరీరంలో హిమోగ్లోబిన్ తక్కువగా ఉన్నట్టు తెలిస్తే.. టీ, కాఫీ, కూల్‍డ్రింక్స్, బీర్ లాంటి ఎక్కువ షుగర్ కంటెంట్ ఉండే డ్రింక్స్ తాగకూడదు. అవసరమైన పోషకాలు శరీరానికి అందేలా బ్యాలెన్స్ డైట్‍ను తీసుకోవాలి. 

Photo: Unsplash

చలికాలపు పండు సీతాఫలం, విటమిన్ సి కోసం తినండి

pixabay