అవిసె గింజలతో చాలా ఆరోగ్య ప్రయోజనాలు.. మీకు తెలుసా?
Photo: Pexels
By Chatakonda Krishna Prakash Nov 10, 2023
Hindustan Times Telugu
అవిసె గింజల్లో (Flaxseeds) చాలా పోషకాలు ఉంటాయి. కాల్షియమ్, పొటాషియమ్, ప్రొటీన్ సహా చాలా పోషకాలు ఉంటాయి. మీ ఆహారంలో అవిసె గింజలను తీసుకుంటే కలిగే ముఖ్యమైన ఆరోగ్య ప్రయోజనాలు ఏవంటే..
Photo: Pexels
అవిసె గింజల్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. దీంతో ఇవి తీసుకుంటే కొలెస్ట్రాల్ లెవెల్స్ తగ్గడంలో సహకరిస్తాయి. దీంతో గుండె ఆరోగ్యానికి మంచి జరుగుతుంది.
Photo: Pexels
అవిసె గింజల్లో ఒమెగా-3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. దీంతో వాపులను ఇది తగ్గించగలదు. ఆరోగ్యకరమైన శరీరానికి ఇవి తోడ్పడతాయి.
Photo: Pexels
అవిసె గింజల్లో ఉండే ఒమెగా-3 ఫ్యాటీ యాసిడ్స్, ఫైబర్ సహా మరిన్ని పోషకాలు శరీరంలో ఇన్సులిన్ సెన్సివిటీని మెరుగుపరుస్తాయి. దీంతో డయాబెటిస్ కంట్రోల్‍లో ఉండేందుకు కూడా ఈ గింజలు తోడ్పడుతాయి. బ్లడ్ ప్రెజర్ కూడా కంట్రోల్‍లో ఉండేందుకు సహకరిస్తాయి.
Photo: Pexels
అవిసె గింజలు జీర్ణక్రియకు కూడా చాలా మేలు చేస్తాయి. మలబద్ధకం సమస్యను కూడా ఇవి తగ్గించగలవు.
Photo: Pexels
అవిసె గింజల్లో కార్బో హైడ్రేట్లు తక్కువగా.. ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. దీంతో బరువు తగ్గాలనుకునే వారు కూడా డైట్‍లో అవిసె గింజలను యాడ్ చేసుకుంటే ప్రయత్నానికి మేలు జరుగుతుంది.
Photo: Pexels
గుండెకు మేలు చేసే పొటాషియం పుష్కలంగా ఉండే ఫుడ్స్ ఇవి